ఆ స్టార్ హీరో కొడుకుతో సితార సినిమా ఎంట్రీ?
ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది పాన్ వరల్డ్ సినిమాగా రూపుదిద్దుకోబోతోంది. అంతర్జాతీయంగా భారీ తారాగణాన్ని రాజమౌళి రంగంలోకి దించుతున్నారు. మహేష్ బాబు ఈ సినిమాకు దాదాపు మూడు సంవత్సరాల సమయం కేటాయించాల్సి ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు.. రెండు భాగాలు రాబోతోందని వార్తలు వస్తున్నాయికానీ దీనిపై అధికారికంగా ధ్రువీకరణ లేదు.
అన్న నుంచి గొప్ప విషయం నేర్చుకున్నా
మహేష్ బాబు సినిమాల విషయంలో ఎంత చురుగ్గా ఉంటారో ఆయన కూతురు సితార అంతకంటే చురుగ్గా ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ను తెలియజేస్తుంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో సితారకు లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. సితార తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. తన అన్న గౌతమ్ ను ఆట పట్టించడం అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. అన్నయ్య నుంచి ఎంత ఓపిగ్గా ఉండాలి అనే విషయాన్ని నేర్చుకున్నానన్నారు. అమ్మ నమ్రత నుంచి ఫ్యాషన్ సెన్స్, నాన్న మహేష్ బాబు నుంచి యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకున్నట్లు చెప్పింది.

తన జుట్టు అంటే తండ్రికి ఎంతో ఇష్టం
ఖలేజా సినిమాలో సీతారామరాజు లాంటి పాత్ర చేయాలని ఉందంటూ తన మనసులోని కోరికను వెల్లడించింది. తండ్రికి తన జుట్టు అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. సినిమా ప్రవేశం గురించి అడగ్గా దానికి ఇంకా సమయం ఉందని చెప్పింది. గతంలోనే మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ తమ కూతురు హీరోయిన్ గా ఎంట్రీ విషయాన్ని అనధికారికంగా చెప్పారు. మంచి అవకాశం వచ్చినప్పుడు పరిశ్రమలోకి వస్తుందని చెప్పారు. తన కోరిక ప్రకారమే ఏదైనా చేస్తామన్నారు. కొద్దిరోజులుగా ఈ విషయంపై పవన్ కల్యాణ్ కొడుకు అకిరా నందన్ హీరోగా, సితార హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో భారీ కాన్సెప్ట్ లో అదిరిపోయే సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం నడుస్తోంది. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. దీనిపై అధికారికంగా ఏమైనా ప్రకటన వస్తుందేమో చూద్దాం.












Click it and Unblock the Notifications