ప్రియాంక 'ద బ్లఫ్' ట్రైలర్ చూశారా? మహేష్ బాబు రియాక్షన్ వైరల్!

The Bluff Trailer: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్న హాలివుడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ద బ్లఫ్' (The Bluff) ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ ట్రైలర్‌పై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించిన తీరు ఇప్పుడు నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.

మహేష్ బాబు ప్రశంసలు.. మురిసిపోయిన ప్రియాంక చోప్రా!

ఎస్‌ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' (SSMB29)లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కలిసి నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతోంది. తాజాగా ప్రియాంక నటిస్తున్న హాలీవుడ్ సినిమా 'ద బ్లఫ్' ట్రైలర్‌ను చూసిన మహేష్ బాబు, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రత్యేకంగా పోస్ట్ చేశారు.

mahesh babu praises priyanka chopra The Bluff Trailer Thank You Dost says Global Star in social media

ప్రియాంక అదరగొట్టింది - మహేష్ బాబు

మహేష్ బాబు తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. "ట్రైలర్ చాలా బాగుంది. ప్రియాంక చోప్రా మరోసారి చాలా పవర్‌ఫుల్, స్ట్రాంగ్ రోల్‌లో కనిపిస్తోంది. ఫిబ్రవరి 25న విడుదల కాబోతున్న 'ద బ్లఫ్' టీమ్ మొత్తానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు." అంటూ మహేష్ బాబు ప్రశంలు కురిపించారు. మహేష్ బాబు తనను అచంచలమైన, అద్భుతమైన నటిగా అభివర్ణించడంపై ప్రియాంక చోప్రా ఫిదా అయిపోయింది. వెంటనే ఆయన పోస్ట్‌కు రిప్లై ఇస్తూ.. "థాంక్యూ దోస్త్" అంటూ రెడ్ హార్ట్, నమస్కారం చేస్తున్న ఎమోజీలను జత చేసింది.

'ద బ్లఫ్' విశేషాలు
ఈ సినిమాలో ప్రియాంక చోప్రా 'బ్లడీ మేరీ' అనే మాజీ సముద్రపు దొంగ (Pirate) పాత్రలో కనిపిస్తోంది. తన గతాన్ని వదిలేసి ప్రశాంతంగా బ్రతకాలనుకునే ఆమెకు ఎదురైన సవాళ్లే ఈ సినిమా కథ. ఈ చిత్రం ఫిబ్రవరి 25న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల కానుంది.

'వారణాసి'లో మహేష్-ప్రియాంక జోడీ

రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న అడ్వెంచర్ డ్రామా 'వారణాసి' పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మహేష్, ప్రియాంకలతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ (పసుపు రంగు చీరలో తుపాకీ పట్టుకున్న స్టిల్) వైరల్ అయ్యింది. కొన్నేళ్ల తర్వాత ప్రియాంక చోప్రా నేరుగా ఓ భారతీయ చిత్రంలో, అది కూడా మహేష్ బాబు సరసన నటిస్తుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+