అల్లు అర్జున్ హిట్ మూవీని.. మహేష్ బాబు అందుకే వద్దన్నారా..?
తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణకి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. రమేష్ బాబు హీరోగా నటించిన 'నీడ' (1979) అనే చిత్రంతో తొలిసారిగా వెండితెరపై కనిపించారు. అప్పుడు అయన వయస్సు కేవలం నాలుగేళ్లు మాత్రమే. ఆ తర్వాత కృష్ణ హీరోగా నటించిన పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించారు.
కాగా మహేష్ బాబు కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు ఉన్నాయి. ఒక్కడు, పోకిరి, దూకుడు, బిజినెస్‌మ్యాన్, శ్రీమంతుడు వంటి చిత్రాలు ఆయన స్టార్‌డమ్ తీసుకొచ్చాయి. అయితే మహేష్ బాబు విన్న కానీ వదిలేసిన కొన్ని కథలు కూడా ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వాటిని ఇతర హీరోలు చేసి బ్లాక్‌బస్టర్ హిట్లు సాధించారు. అలాంటి కథల్లో ఒకటి రేసుగుర్రం.

ఈ సినిమాను డైరెక్ట్ చేసిన సురేందర్ రెడ్డి.. మొదట మహేష్ కోసం హీరో క్యారెక్టర్‌ని స్టైలిష్‌గా డిజైన్ చేశారట. కానీ ఆ సమయంలో మహేశ్ బాబు బిజీగా ఉండటంతో టైమ్ అడిగారని అంటున్నారు. షెడ్యూల్‌లో గ్యాప్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఆయన ఆ సినిమా చేయలేకపోయారని సమాచారం.
కానీ అదే కథను సురేందర్ రెడ్డి అల్లు అర్జున్ కి వినిపించగా వెంటనే ఓకే చెప్పారు. యాక్షన్, కామెడీ, బ్రదర్ సెంటిమెంట్ మిళితమైన ఈ కథ అల్లు అర్జున్‌కు పర్‌ఫెక్ట్‌గా సూట్ అయ్యింది. విడుదలైన వెంటనే సినిమా సూపర్ హిట్‌గా మారింది. రేసుగుర్రంతోనే బన్నీ మొదటిసారి రూ.50 కోట్ల క్లబ్లో చేరి స్టార్ హీరోల రేసులో బన్నీ దూసుకుపోయాడు. ఒకవేళ ఆ సినిమా మహేష్ చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అని ఆయన అభిమనులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

ప్రస్తుతం మహేష్ దర్శకధీరుడు రాజమౌళితో ఒక మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారు. SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం. రీసెంట్ గానే మహేష్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఈ ఏడాది నవంబర్‌లో అప్ డేట్స్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఒక ఫోటోని కూడా షేర్ చేశారు.
ఇప్పటికే మూడు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసిన రాజమౌళి.. సినిమాని అనుకున్న సమయానికి పూర్తి చేసి 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా టాలీవుడ్ స్థాయిని గ్లోబల్ లెవల్‌కి తీసుకెళ్తుందని అభిమానులు నమ్ముతున్నారు












Click it and Unblock the Notifications