'రోమాంచకం' చూసిన మహేశ్ బాబు.. సినిమాపై సూపర్ స్టార్ రివ్యూ ఇదే!

యువ హీరో సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ జంటగా నూతన చిత్రం 'రోమాంచకం'. ఈ సినిమా విడుదలైన రోజే సూపర్ స్టార్ మహేశ్ బాబు నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాపై మహేశ్ బాబు తన అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతా వేదికగా స్పందించారు. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని ఉద్దేశించిన ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Romanchakam Movie Review: 'రోమాంచకం' మూవీ రివ్యూ.. హిట్టా.. ఫట్టా?
Romanchakam Movie Review: 'రోమాంచకం' మూవీ రివ్యూ.. హిట్టా.. ఫట్టా?

ఈ సినిమాను "ఎంటర్‌టైనింగ్ అండ్ ప్రామిసింగ్" అని మహేశ్ బాబు అభివర్ణించారు. " రోమాంచకం సినిమా ఎంతో వినోదాత్మకంగా, ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా సహా మొత్తం చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ప్రాజెక్ట్ వెనుక మీరు పెట్టిన ప్రేమ, అభిరుచి, పడిన కష్టం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం, విజయం మీ అందరికీ పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని మహేశ్ బాబు రాసుకొచ్చారు.

Mahesh Babu Watches Romanchakam Here Is What Superstar Said About The Film Calls it entertaining Movie

సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదలకు సిద్ధమైన వేళ మహేశ్ బాబు చేసిన ఈ పోస్ట్ చిత్ర బృందానికి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. కొత్త దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అడ్వాన్స్ బుకింగ్స్ తో విడుదలైన ఈ చిత్రానికి మహేశ్ బాబు అందించిన మద్దతు యూత్, ఆయన అభిమానుల్లో సినిమాపై మంచి బజ్ ఏర్పడేందుకు దోహదపడింది.

'లక్కీ భాస్కర్ 2' పై కీలక అప్డేట్.. వెంకీ అట్లూరి కామెంట్స్ వైరల్
'లక్కీ భాస్కర్ 2' పై కీలక అప్డేట్.. వెంకీ అట్లూరి కామెంట్స్ వైరల్

అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసిన ఈ పోస్ట్ సినిమాపై ఓ సానుకూల అభిప్రాయం మాత్రమేనని.. పూర్తిస్థాయి రివ్యూ లేదా రేటింగ్ కాదని గమనించాలి. మొదటి వారాంతంలో థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణ, వసూళ్లను బట్టే 'రోమాంచకం' అసలైన ఫలితం తేలనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+