Mahesh Babu: ప్రేమలు సినిమాపై వైరల్ అవుతున్న మహేష్‌బాబు ట్వీట్...
Mahesh Babu: ప్రేమలు సినిమాపై వైరల్ అవుతున్న మహేష్‌బాబు ట్వీట్ : సూపర్ స్టార్ మహేష్‌బాబు పేరు తెలియని సీనిప్రియులుండరు. ఈ మధ్యకాలంలో వరుస సినిమాలతో ప్రిన్స్ ఫుల్ బిజిగా గడిపేస్తున్నారు. తాజాగా మహేష్‌బాబు చేసిన ట్వీట్‌తెగ వైరల్ అవుతోంది. ప్రేమలు సినిమా గురించి మహేష్‌బాబు ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కాస్త ఇప్పడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మలయాళ సూపర్ హిట్ చిత్రం ప్రేమలు తెలుగులో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాను రాజమౌళి తనయుడు కార్తీకేయ తెలుగులోకి డబ్ చేశారు. ఈ మూవీకి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక, యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాకు ప్రేక్షకులతోపాటు సెలబ్రెటీలు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంపై మహేష్ బాబు ట్వీట్ చేశాడు. ప్రేమలు సినిమాపై మహేష్‌బాబు రివ్యూ ఇచ్చాడు.

ప్రేమలు సినిమాపై మహేష్‌బాబు రివ్యూ : మహేష్‌బాబు చేసిన ట్వీట్‌లో ఇలా రాసి ఉంది.. "ప్రేమలు సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు కార్తీకేయ. ఈ సినిమాను నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. చివరిసారిగా ఓ సినిమా చూస్తూ ఇంతలా నవ్వుకున్నానో అసలు గుర్తులేదు. చాలా కాలం తర్వాత ఇంతలా నవ్వుకున్నాను. నా కుటుంబం మొత్తానికి ఈ సినిమా బాగా నచ్చింది. యంగ్ స్టర్స్ అందరూ యాక్టింగ్ అదరగొట్టారు. ఈ సినిమా టీమ్ మొత్తానికి నా శుభాకాంక్షలు " అంటూ మహేష్ ట్వీట్ చేశారు. ఇక, ఈ చిత్రంలో మమిత బైజు, మాథ్యూ థామస్ కీలకపాత్రలు పోషించారు.
Thank you @ssk1122 for bringing #Premalu to the Telugu audience... Thoroughly enjoyed it…. Can't remember the last time when I laughed so much while watching a film… The entire family loved it 😁 Top class acting by all the youngsters 🤗🤗🤗Congratulations to the entire team!!
— Mahesh Babu (@urstrulyMahesh) March 12, 2024
ఈ సినిమాకు గిరీష్ ఏడీ దర్శకత్వం వహించారు.ప్రస్తుతం మహేష్‌బాబు రాజమౌళి సినిమా కోసం సిద్ధంగా ఉన్నాడు. జక్కన్న ప్రాజెక్ట్ కోసం మహేష్‌బాబు జర్మనీ అడవుల్లో శిక్షణ కూడా పూర్తిచేసుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనుల్లో బిజిగా ఉంటూనే అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటున్నాడు మహేష్. ఇక, రాజమౌళి సినిమా కోసం మహేష్‌బాబు హాలీవుడ్ హీరోగా కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తుంది.












Click it and Unblock the Notifications