హీరో నిఖిల్ మూవీ షూటింగ్‌లో భారీ ప్రమాదం, తీవ్రగాయాలు...
తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు యంగ్ హీరో నిఖిల్. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా కార్తికేయ 2 సినిమా తర్వాత నిఖిల్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. తాను చేసిన ప్రతి సినిమా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది.
ఈ క్రమంలోనే ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న చిత్రం "ది ఇండియన్ హౌస్". అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. హైదరాబాద్ శంషాబాద్ సమీపంలో వేసిన సెట్లో ఈ ప్రమాదం సంభవించింది. సినిమాలోని సముద్ర సన్నివేశాల కోసం ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ అకస్మాత్తుగా పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం నీటమునిగింది. ఈ ప్రమాదంలో ఒక అసిస్టెంట్ కెమెరామెన్‌కు తీవ్ర గాయాలు కాగా, ఇంకా మరికొంత మంది సిబ్బంది గాయపడ్డట్లు తెలుస్తోంది.

అంతే కాకుండా ఈ ఘటనతో సెటప్ మొత్తం ధ్వంసం అయినట్టు చెబుతున్నారు. తీవ్ర ఆర్థిక నష్టం సంభవించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అలానే పరిస్థితిని సమీక్షించిన యూనిట్ ప్రస్తుతం షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలుస్తోంది. సినిమాకు సంబంధించి ఇతర అప్‌డేట్స్ త్వరలో వెలువడనున్నాయి.
ఈ విషాద ఘటన పట్ల పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని.. భద్రతా ప్రమాణాలు పాటించాలనే అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
హీరో నిఖిల్ "ది ఇండియన్ హౌస్ " షూటింగ్ లో భారీ ప్రమాదం.#Nikhil #TheIndianHouse pic.twitter.com/bRwsW2uVf9
— Filmy Bowl (@FilmyBowl) June 11, 2025












Click it and Unblock the Notifications