రెండో పెళ్లికి రెడీ అంటున్న 51 ఏళ్ల హాట్ బ్యూటీ..!
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తనదైన ముద్ర వేసిన నటి "మలైకా అరోరా". 50 ఏళ్ల వయసులోనూ తరగని అందం, అద్భుతమైన ఫిట్‌నెస్‌తో ఆమె ఇప్పటికీ యువ నటీమణులకు పోటీ ఇస్తున్నారు. మలైకా అరోరా హిందీ సినిమాల్లో ఎక్కువగా ఐటెం సాంగ్స్ ద్వారానే గుర్తింపు తెచ్చుకుంది.
1998లో వచ్చిన దిల్ సె సినిమాలో షారుక్ ఖాన్‌తో చేసిన "చయ్యా చయ్యా" పాట ఆమెకు భారీ పాపులారిటీ తెచ్చింది. తరువాత కాంటేలో "మహి వే", దబాంగ్లో "మున్నీ బద్నామ్", దబాంగ్ 2లో "పాండే జీ సీటీ" వంటి సూపర్‌హిట్ సాంగ్స్‌లో కనిపించింది. అలానే తెలుగులో కూడా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీలో కెవ్వు కేక సాంగ్ తో ఫుల్ క్రేజ్ సంపాదించింది.

కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మలైకా అరోరా నటుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం నిలవలేదు. మనస్పర్థల కారణంగా 2017లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మలైకా తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన నటుడు అర్జున్ కపూర్‌తో ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ పలు ఈవెంట్లకు, వెకేషన్లకు కలిసి హాజరై వార్తల్లో నిలిచారు. అయితే ఇటీవల ఈ జంట విడిపోయారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
రెండో పెళ్లిపై క్లారిటీ..
అయితే అర్జున్ కపూర్‌తో విడిపోయారన్న వార్తల మధ్య మలైకా అరోరా రీసెంట్ గా ఒక 'మిస్టరీ మ్యాన్'తో కలిసి కనిపించి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఒక రెస్టారెంట్ బయట, ఆ తర్వాత సింగర్ ఎ.పి. ధిల్లాన్ సంగీత కచేరీలో వీరు ఇద్దరూ కలిసి కనిపించారు. ఆ మిస్టరీ మ్యాన్ రాహుల్ విజయ్. కచేరీలో ఎ.పి. ధిల్లాన్ మలైకాను తన చిన్ననాటి క్రష్‌గా పేర్కొంటూ ఆమె కోసం ఒక ప్రత్యేక పాట పాడారు. అనంతరం మలైకా తన ప్రియుడు రాహుల్ విజయ్‌తో కలిసి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫోటో వైరల్ అయింది.
ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మలైకా అరోరా తన రెండో పెళ్లి గురించి స్పష్టత ఇచ్చారు. విడాకుల తర్వాత తాను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని, తనను స్వార్థపరురాలిగా చిత్రీకరించారని ఆమె వాపోయారు. ఆ నిర్ణయం తనను మెరుగైన వ్యక్తిగా మార్చిందని.. ఆనందంగా ఉండటానికి సహాయపడిందని తెలిపారు. తాను ఒక హార్డ్ కోర్ రొమాంటిక్‌ని అని.. ప్రేమను నమ్ముతానని చెబుతూ మంచి వ్యక్తి దొరికితే కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటానని ఆమె ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications