ఇదేం ట్విస్టు సందీపు.. ప్రభాస్ 'స్పిరిట్' సినిమాలో 'మెగాస్టార్'
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మారుతితో రాజా సాబ్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డితో 'స్పిరిట్' చిత్రం చేయనున్నారు. ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఒక సీరియస్ కాప్ స్టోరీ అంటూ ప్రతి ఇంటర్వ్యూలో ఈ సినిమా ఓ రేంజ్ ఎలివేషన్ ఇస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి ఓ హాట్ న్యూస్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా. స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయిందని.. హర్షవర్దన్ రామేశ్వర్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ చేశారని టాక్ నడుస్తోంది. దాంతో ప్రస్తుతం నటీనటుల వేటలో బిజీగా ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో కొరియన్ యాక్టర్ లీ సహా పలువురు బాలీవుడ్ నటులు నటించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన పాత్రను కూడా బాగా డిజైన్ చేశారని.. అందుకే మమ్ముట్టి సైతం ఓకే చెప్పారని అంటున్నారు.

చిత్ర పరిశ్రమలో ఇప్పటికే ఎన్నో వందల చిత్రాలు పోలీస్ క్యారెక్టర్ లీడ్ గా వచ్చాయి. కానీ ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్‌పై ఈ తరహా కథ రాలేదని దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా బలంగా చెబుతున్నారు. దాంతో సందీప్ ఈ చిత్రంతో ఏ మ్యాజిక్ చేయబోతున్నాడో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఒక్కసారిగా షాక్ ఇచ్చిన సందీప్.. ఆ తర్వాత కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి బాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక రీసెంట్ గానే రణ్‌బీర్ కపూర్ హీరోగా యానిమాల్ తెరకెక్కించి రికార్డులు కొల్లగొట్టాడు. దీంతో ఇప్పుడు ప్రభాస్ ను మొదటిసారి పోలీస్ రోల్ లో ఎలా చూపిస్తాడో అని భారీ అంచనాలు నెలకొన్నాయి.
బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్.. సలార్, కల్కి సినిమాలతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఇక సందీప్ డైరెక్షన్ లో 'స్పిరిట్'సినిమాతో మరోసారి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయడం కన్ఫార్మ్ అని భావిస్తున్నారు. మరోవైపు మారుతితో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో మాళవిక మోహనన్ తో పాటు.. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలకపాత్ర పోషిస్తుండగా.. మురళీ శర్మ, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications