వీడియో వైరల్: 'హీ ఈజ్ ఎక్స్‌ట్రార్డినరీ'..పవన్ కల్యాణ్ ను ఇమిటేట్ చేసిన మల్లారెడ్డి కోడలు..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన 'గబ్బర్ సింగ్' మూవీ ఎలాంటి విధ్వంసం సృష్టించిందో తెలిసిందే. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతోంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' తో మరోసారి బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మార్చి 26న గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన దేఖ్ లేంగే సాలా సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే తాజాగా ఈ మూవీ నుంచి రెండో సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఆరా ఆఫ్ ఉస్తాద్ అంటూ సాగే ఈ సాంగ్ ను విడుదల చేశారు. అయితే ఈ వేడుక హైదరాబాద్ మల్లారెడ్డి కళాశాలలో అట్టహాసంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్లారెడ్డి కోడలు డాక్టర్. ప్రీతిరెడ్డి.. పవన్ కల్యాణ్ మేనరిజాన్ని ఇమిటేట్ చేశారు. మెడపై చేయి పెట్టి పవన్ కల్యాణ్ ఐకానిక్ షాట్ ను రీ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. హీ ఈజ్ ఎక్స్‌ట్రార్డినరీ అని కామెంట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Mallareddy's daughter-in-law #Preety imitates #Pawankalyan's mannerism.pic.twitter.com/NzIbdy6s1c
— Milagro Movies (@MilagroMovies) February 22, 2026
ఇక తాజాగా రీలీజ్ అయిన 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్లే' అనే సాంగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ సాంగ్ కు దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్ కంపోజ్ చేశారు. అలాగే పవన్ కల్యాణ్ ను ఎలివేట్ చేసేలా గీత రచయిత చంద్రబోస్ లిరిక్స్ రాశారు. ఎస్పీ అభిషేక్ తో కలిసి డీఎస్పీ స్వయంగా ఈ గీతాన్ని పాడారు. మరి ఈ సాంగ్ వెండి తెరపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ మూవీలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పార్థిబన్, కెయస్ రవికుమార్, ఎల్. బి శ్రీరామ్, రావు రమేష్, రాంకీ, కెజిఎఫ్ అవినాష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మార్చి 26న థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది.












Click it and Unblock the Notifications