Naga Babu Konidela: పోలీసు క్యారెక్టర్ పై వ్యాఖ్యలు-సారీ చెప్పిన నాగబాబు..!

టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆయన తండ్రి, నటుడు, నిర్మాత కొణిదెల నాగబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ ఈవెంట్ లో పోలీసు క్యారెక్టర్లపై నాగబాబు చేసిన వ్యాఖ్యలు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశం కూడా అయ్యాయి. వీటిపై విమర్శలు రావడంతో ఇవాళ నాగబాబు స్పందించారు. ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా సినిమాల్లో పోలీసు క్యారెక్టర్లపై తాను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు.

ఇంతకీ నాగబాబు సినిమాల్లో పోలీసు క్యారెక్టర్లపై ఏమన్నారంటే.. పోలీసు క్యారెక్టర్ 6 అడుగుల 3 అంగుళాలు ఉండే వ్యక్తులు (తన కుమారుడు వరుణ్ తేజ్ ను ఉద్దేశించి) చేస్తే బావుంటుందని, 5 అడుగుల 3 అంగుళాల వ్యక్తులు చేస్తే నప్పదంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కలకలం రేగింది. నాగబాబు వ్యాఖ్యలు ఇప్పటికే పోలీసు శాఖలో ఉన్న సిబ్బందిని అవమానించేలా ఉన్నాయన్న విమర్శలు వచ్చాయి. దీంతో నాగబాబు స్పందించారు.

mega brother konidela nagababu apologies over remarks on police character in movies

"ఇటీవల జరిగిన వరుణ్ బాబు 'ఆపరేషన్ వాలెంటైన్' ప్రీ రిలిజ్ ఈవెంట్ లో నేను పోలిస్ క్యారెక్టర్‌ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడాను,ఆ మాటలు నేను వెనక్కి తీస్కుంటున్నాను,ఎవరైన ఆ మాటలకి నొచ్చుకునుంటే I'm Really Very sorry,అది యాదృచ్ఛికంగా వచ్చిందే కాని Wanted గా అన్న మాటలు కాదు,అందరు అర్ధం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నాను.." ఇట్లు మీ నాగబాబు అంటూ వివరణ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+