మరో ప్రేమలో మెగాడాటర్ శ్రీజ..వీడియో వైరల్

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిందే. శ్రీజ మొదట భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించింది. పెద్దలను ఎదురించి మరి అతన్ని వివాహం చేసుకుంది. శ్రీజ ప్రేమ వివాహం అప్పట్లో పెను సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ఆ సమయంలో చిరంజీవి, పవన్ కల్యాణ్‌లపై శ్రీజ సంచలన ఆరోపణలు చేసింది. భరద్వాజ్‌తో శ్రీజ కాపురం కొన్నాళ్లు బాగానే సాగింది. కూతురు పుట్టిన తరువాత భర్త భరద్వాజ్‌తో విభేదాలు రావడంతో..అతనికి విడాకులు ఇచ్చింది.

mega daughter sreeja revealed her love video viral

పెద్దలు కుదిర్చిన వ్యక్తిని శ్రీజ రెండో వివాహం చేసుకుంది. శ్రీజ రెండో భర్త కల్యాణ్ ఒకటి రెండు సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. తరువాత కొద్దిరోజులకే రెండో భర్త నుంచి కూడా శ్రీజ దూరంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఆఫిషియల్‌గా ప్రకటించకపోయినప్పటికీ..శ్రీజ- కల్యాణ్ ఇద్దరు వీడిపోయారని తెలుస్తుంది. సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన ఫొటోలను తొలగించడంతో.. పాటు.. ఒకరినొకరు అన్ ఫాలో చేయడంతో..వీరిద్దరూ విడిపోయారని నెటిజన్లు కన్ఫర్మ్ చేసుకున్నారు.

ఆ మధ్య శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చినప్పటికీ అది కేవలం ప్రచారం మాత్రమే అని తేలిపోయింది. ప్రస్తుతం ఇద్దరి పిల్లలతో శ్రీజ తన తండ్రి చిరంజీవితోనే ఉంటుంది. తాజాగా శ్రీజ తన సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేసింది. తన అక్క సుస్మిత పుట్టిన రోజు కావడంతో విషెష్ తెలుపుతూ ... నా రోజా నువ్వే . నా జీవితాన్ని అర్థవంతంగా చేస్తున్నావు అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. దీన్ని చూసిన నెటిజన్లు అక్కపై శ్రీజకు ఎంత ప్రేమ ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీజ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+