దెబ్బకు సైలెంట్ అయిన మెగా ఫ్యాన్స్

మొన్నటి వరకు తెగ హడావిడి చేసిన మెగా అభిమానులు దెబ్బకు సైలెంట్ అయ్యారు. దీనికి కారణం దర్శకుడు శంకర్. ఆయన దర్శకత్వం వహించిన భారతీయుడు-2 సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. లోక నాయకుడు హీరోగా నటించిన భారతీయుడు సినిమాకు ఈ సినిమా స్వీకల్‌గా వచ్చింది. 1996లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే.

అవినీతికి వ్యతిరేకంగా తెరకెక్కిన ఈ సినిమాలో మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఎ.ఆర్. రెహ్మాన్ సంగీత దర్శకత్వం వహించారు. పేరుకే తమిళ సినిమా అయినప్పటికి తెలుగులో కూడా భారతీయుడు ఘన విజయం సాధించింది. అవినీతి చేసింది సొంత కొడుకైనా సరే చంపే వ్యక్తిగా కమల్ హాసన్ నటన అద్భుతంగా ఉంటుంది.

Mega fans are silent after seeing Indian-2 result

28 సంవత్సరాల తర్వాత ఈ భారతీయుడు సినిమాకు స్వీకెల్ తెరకెక్కిన భారతీయుడు -2 బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. కథ, కథనం అంతగా ఆకట్టుకోకపోవడం, దర్శకుడు శంకర్ మార్క్ సినిమాలో లేకపోవడంతో భారతీయుడు -2 రిజల్ట్ తేడా కొట్టింది. ముఖ్యంగా ఎ.ఆర్. రెహ్మాన్ సినిమాకు పని చేయకపోవడం పెద్దలోటుగా అభివర్ణిస్తున్నారు. భారతీయుడు -2 ఫ్లాప్ కావడంతో దర్శకుడు శంకర్ తదుపరి సినిమాలపై ఆ ప్రభావం పడినట్టే కనిపిస్తోంది.

శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా తెరకెక్కుతుంది. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. మరో 15 రోజులు షూటింగ్ జరిగితే సినిమా పూర్తి అవుతుందని శంకర్ తెలిపారు. మొన్నటి వరకు గేమ్ ఛేంజర్ నుంచి ఎటువంటి ఆప్టేడ్ రావడం లేదని, సినిమా ఎప్పుడు విడుదల చేస్తారని దర్శకుడు శంకర్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన మెగా అభిమానులు, ఇప్పుడు భారతీయుడు -2 రిజల్ట్ చూసిన తర్వాత గేమ్ ఛేంజర్ ఇప్పట్లో విడుదల చేయవద్దని వేడుకుంటున్నారు.

భారతీయుడు -2 రిజల్ట్ ప్రభావం ఇప్పట్లో పోయేలా కనిపించడం లేదు. దీనికి తోడు శంకర్ తన మార్క్ చూపించకపోవడంతో గేమ్ ఛేంజర్ సినిమా ఇప్పట్లో విడుదల చేయకపోవడమే మంచిదనే అభిప్రాయం మెగా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+