నందమూరి మోక్షజ్ఞకు భారీ షాక్ ఇచ్చిన మెగా ఫ్యామిలీ?

నందమూరి అభిమానులు ఎప్పుడా? ఎప్పుడా? అంటూ కళ్లు కాయలు కాచేలా తమ అభిమాన హీరో బాలయ్య తనయుడి సినీ రంగ ప్రవేశం కోసం ఎదురుచూశారు. ఎట్టకేలకు అన్నిరకాల జాతకాలు, ముహూర్తాలు చూసుకున్న బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ పుట్టినరోజైన సెప్టెంబరు ఆరోతేదీన అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సోషియా మైథలాజికల్ మూవీగా ఈ సినిమాను తీసుకురాబోతున్నారు. పోస్టర్ గా చాలా స్లిమ్ గా ఉన్న మోక్షజ్ఞ లుక్ అందరినీ ఆకట్టుకుంది.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా
లెజెండ్ మూవీస్ బ్యానర్ పై బాలయ్య చిన్న కూతురు మతుకుమల్లి తేజస్విని, ఎస్ఎల్వీ బ్యానర్ చెరుకూరి సుధాకర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న రెండో ప్రాజెక్టు అని దర్శకుడు ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తోపాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మోక్షజ్ఞకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కోవలోనే మెగా ఫ్యామిలీకి చెందిన సాయిదుర్గాతేజ్ కూడా మోక్షజ్ఞ శుభాకాంక్షలు తెలియజేశారు.
ట్విటర్ వేదికగా ఆయన ఇలా రాసుకొచ్చారు.

mega hero sai dharam tej wishes to nandamuri mokshagna

మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతున్నా
మోక్షు సినీ పరిశ్రమలోకి ప్రవేశించినందుకు తాను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ఈరోజు నుంచి మీరు సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. మంచి అపురూపమైన తెలుగు సినిమాతో, తెలుగు ప్రేక్షకుల ప్రేమ, ఆదరాభిమానాలతో మీ సినీ రంగ ప్రవేశం శుభప్రదమవుతుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఈ సరికొత్త విహారయాత్ర ప్రశాంత్ వర్మతోపాటు సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఘనవిజయాన్ని అందించాలని కోరుకుంటున్నట్లు ట్విటర్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం మోక్షుపై సాయిధరమ్ తేజ్ పెట్టిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరలైంది.

ఒకరకంగా షాక్ లాంటిదే
ప్రతి ఒక్కరూ సాయిధరమ్ తేజ్ ను ప్రశంసిస్తున్నారు. ఇటువంటి వాతావరణం ఉన్నప్పుడే సినీ పరిశ్రమ చిరకాలం వర్ధిల్లుతుందని, హీరోల మధ్య పోటీ అనేది కేవలం సినిమాల వరకే పరిమితం కావాలని, తర్వాత అందరూ ఎంతో స్నేహంగా ఉండాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మెగా కుటుంబం నుంచి మోక్షుకు ఇటువంటి శుభాకాంక్షలు రావడం ఒకరకంగా షాక్ లాంటిదేనని నందమూరి అభిమానులు అంటున్నారు. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా నందమూరి, మెగా కుటుంబాల మధ్య సినిమాల పరంగా హోరాహోరీ పోరు సాగుతున్న సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+