అల్లు అర్జున్‌కు దూరంగా మెగా హీరోలు.. వరుణ్ తేజ్ షాకింగ్ ట్వీట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ జనసందోహం ఏర్పడింది. ఈక్రమంలో ఓ మహిళ మరణించారు. ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్‌తో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అల్లు అర్జున్‌ను శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

వైద్య పరీక్షలు అనంతరం అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టులో హాజరపరిచారు. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ తరుఫు న్యాయవాదులు హైకోర్టు తలుపులు తట్టారు. ఎట్టకేలకు హైకోర్టు అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేసింది. 4 వారాల మధ్యంతర బెయిల్‌తో పాటు, రూ.50 వేల పూచీకత్తుతో పర్సనల్ బాండ్ మీద అల్లు అర్జున్‌ను విడుదల చేయడం జరిగింది. అల్లు అర్జున్ విడుదల కావడంతో యావత్తు తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా ఆయన ఇంటికి తరలివచ్చింది.

Mega heroes that Allu Arjun does not go to visit after arrest

విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, నాగ చైతన్య, అఖిల్, వెంకటేష్, సుధీర్ బాబు, కన్నడ హీరో ఉపేంద్ర, రానా, దర్శకులు సుకుమార్, హరీష్ శంకర్, కొరటాల శివ, రాఘవేంద్రరావు మొదలగు సెలబ్రిటీలు అల్లు అర్జున్‌ను కలిసి పరామర్శించారు. ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్‌లు అల్లు అర్జున్‌తో ఫోన్లో మాట్లాడారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా అల్లు అర్జున్‌ను కలవలేదు. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించినప్పుడు మాత్రం చిరంజీవి, నాగబాబు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు. అయితే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన తర్వాత మెగా హీరోలు ఎవరూ కూడా అల్లు ఇంటి వైపు కన్నెత్తి చూడలేదు.

చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ , నిహారిక వీరిలో ఒక్కరు కూడా అల్లు అర్జున్‌ను పరామర్శించడానికి వెళ్లలేదు. కనీసం అల్లు అర్జున్ అరెస్ట్‌ను కూడా వీరు ఖండించలేదు. ఇదే సమయంలో వరుణ్ తేజ్ మాత్రం సాయి ధరమ్ తేజ్ నటించిన కొత్త సినిమా గురించి ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కష్టాల్లో ఉంటే సానుభూతి తెలపకుండా, సినిమాపై ట్వీట్ చేయడం ద్వారా మెగా ఫ్యామిలీలో విభేదాలు ఉన్నట్టు చెప్పకనే చెప్పినట్టు అయింది. మరి దీనిపై అల్లు ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+