జూనియర్ ఎన్టీఆర్ పై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

నందమూరి నటవారసుడిగా పరిశ్రమలోకి ప్రవేశించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా మారిపోయాడు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకోగా, ఆది, సింహాద్రి సినిమాలతో సూపర్ స్టార్ అయ్యాడు. నటన పరంగా ఎటువంటి వంక పెట్టడానికి వీలులేనిరీతిలో అద్భుతమైన నటనతో ముందుకు దూసుకుపోతున్నాడు. చిన్నతనంలోనే గుణశేఖర్ దర్శకత్వంలో బాలరామాయాణం సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఎన్టీఆర్ నటన ఎంతో బాగుందని పరిశ్రమలోని అతిరథులంతా ప్రశంసలు కురిపించారు.

బాల రామాయణం సినిమా చేసిన తర్వాత గుణశేఖర్ చిరంజీవికి ఒక కథ చెప్పడానికి వెళ్లాడు. అంతకుముందు తాను చేసిన బల రామాయణం సినిమాను చిరంజీవి చూశారు. రాముడు పాత్ర పోషించిన అబ్బాయి కెరీర్ లో స్టార్ హీరో అవుతాడని చిరంజీవి అన్నారు. ఆయన వ్యాఖ్యలకు తగినట్లుగా తారక్ స్టార్ హీరో అయ్యారు. ఎన్టీఆర్ స్టార్ హీరో అవుతాడని చిరంజీవి ఎలా చెప్పగలిగారంటే.. నటనలోని ప్రావీణ్యం చూసినప్పుడే అర్థమవుతుందంటారు. నందమూరి హీరో గురించి చిరంజీవి అలా చెప్పడం గ్రేట్ అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

megastar chiranjeevi comments on junior ntr

చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రం చేస్తున్నారు. త్రిష కథానాయికగా నటిస్తోంది. అలాగే ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం చేస్తున్నారు. ఇది రెండు భాగాలుగా రూపొందుతోంది. జాన్వీకపూర్ కథానాయిక. పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతోంది. అనిరుధ్ రవిచంద్ర సంగీతం అందించడంలో ఆలస్యం జరుగుతుండటంతో దేవర చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. దీనివల్ల జూనియర్ ఎన్టీఆర్ షెడ్యూల్ కూడా అటూ ఇటూ కాకుండా అయిందని వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రంతోపాటు వార్ 2 సినిమా కూడా తారక్ చేయాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+