సమంతకు పెళ్లైంది కాబట్టి వద్దన్నారు!!
సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆమె స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. నాగచైతన్యతో ప్రేమ, తర్వాత వివాహం, తర్వాత విడాకులు అయిపోయాయి. ఎవరికివారు ఒంటరిగా ఉంటున్నారు. సమంత ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్, ఓ సినిమా చేస్తోంది. మయోసైటిస్ తో ఏడాది విరామం తర్వాత సొంత బ్యానర్ లో సినిమా చేస్తోంది. తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ పక్కన హీరోయిన్ గా ఓ అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయి. అయితే దాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
చిరంజీవి సమంతనే ఎంపిక చేయమన్నారు
రంగస్థలంలో రామ్ చరణ్ పక్కన నటించి తన నటనతో భేష్ అనిపించుకుంది సమంత. అయితే సినిమా కథ విన్నతర్వాత చాలామంది సమంతకు పెళ్లైంది కాబట్టి హీరోయిన్ గా వద్దు.. వేరేవారిని తీసుకుందామని చెప్పారు. అయితే కథ విన్న తర్వాత చిరంజీవి మాత్రం సమంతనే ఎంపిక చేయమని దర్శకుడు సుకుమార్ కు సూచించారు. ఇలా అంటున్నారు అందరూ అని చెప్పగా.. పెళ్లయితే ఏమిటి? ఆ పాత్ర చేసేటప్పుడు బాగా చేశారా? లేదా? అనే ప్రేక్షకుడు చూస్తాడు కానీ పెళ్లయిందా? లేదా? అనే విషయాన్ని చూడరని చిరంజీవి చెప్పినట్లు ఓ వేడుకలో సుకుమార్ చెప్పారు.

సమంతకు మంచి పేరు వచ్చింది
తర్వాత ఆ పాత్రకు సమంతను ఎంపిక చేశారు. చెవిటివాడిగా నటించిన రామ్ చరణ్ ఎంతో పేరు తెచ్చుకోగా, అతని పక్కన కథానాయికగా నటించి సమంతకు కూడా మంచి పేరు వచ్చింది. మొదట్లో సుకుమార్ కూడా ఈ పాత్ర సమంత చేస్తుందో? లేదో? అని సందేహించారంట. పల్లెటూరి పిల్లగా ఆ యాసలో మాట్లాడటంతోపాటు గేదెలను కడగాల్సి ఉండటం, గడ్డిమోపును మోయాల్సి ఉండటంతో అటువంటివి చేస్తుందా? లేదా? అని అనుకున్నారంట. అయితే తన అంచనాలను సమంత పటాపంచలు చేసిందని, హీరోయిన్ గా అద్భుతంగా నటించిందని సుకుమార్ మరో సందర్భంలో సమంత గురించి ప్రశంసించారు.












Click it and Unblock the Notifications