మిస్టర్ బీన్‌తో డేటింగ్‌లో మియా ఖలీఫా .. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ!
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వింత వార్త హల్చల్ చేస్తోంది. బ్రిటీష్ కామెడీ లెజెండ్.. మనందరికీ మిస్టర్ బీన్‌గా సుపరిచితుడైన రోవన్ అట్కిన్సన్(71), మాజీ అడల్ట్ స్టార్ మియా ఖలీఫా(33) డేటింగ్‌లో ఉన్నారనే వార్త సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. వీరిద్దరూ గతేడాది వేసవి కాలం నుంచి రహస్యంగా డేటింగ్ చేస్తున్నారని.. ఫ్రాన్స్‌లో విలాసవంతమైన యాచ్‌లపై గడుపుతున్నారని కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి.
అసలు ఈ పుకారు ఎలా పుట్టింది?
ఈ వార్త అంతా ఓ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి మొదలైంది. ఆ ఇన్‌స్టాగ్రామ్ పేజీ కేవలం వినోదం కోసం కల్పిత వార్తలను పోస్ట్ చేస్తుంది. జనవరి 18, 2026న వారు వీరిద్దరి ఫోటోను పోస్ట్ చేస్తూ.. "మిస్టర్ బీన్ తన హీరోయిన్‌ను కనుగొన్నాడు" అని సరదాగా రాశారు. ఆ పోస్ట్‌లో ఉన్న ఫోటోలు నిజమైనవి కావు. అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించినవి. కానీ, చాలా మంది ఇది నిజమైన వార్త అని నమ్మి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.

మియా ఖలీఫా ఘాటు స్పందన
ఈ పుకార్లపై మియా ఖలీఫా తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందిస్తూ అసలు విషయాన్ని తేటతెల్లం చేసింది."నేను ఒక మూర్ఖుడితో డేటింగ్ చేస్తున్నాను నిజమే.. కానీ అతను మిస్టర్ బీన్ మాత్రం కాదు" అని ఆమె పోస్ట్ చేసింది.ఈ పుకార్లను ఆమె సరదాగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. తన డేటింగ్‌ను ఖండించిన వార్తను రీ-షేర్ చేస్తూ.. "కానీ నాకు ఆ ప్రతిపాదనపై అభ్యంతరం లేదు" అంటూ జోక్ చేసింది.
guys I am dating a fool but it’s not mr bean
— Mia K. (@miakhalifa) January 20, 2026
వారి వ్యక్తిగత జీవితాలు
నిజానికి వీరిద్దరూ ప్రస్తుతం తమ తమ వ్యక్తిగత జీవితాల్లో బిజీగా ఉన్నారుయ రోవన్ అట్కిన్సన్ 2013 నుండి నటి లూయిస్ ఫోర్డ్‌తో సహజీవనం చేస్తున్నారు. వారికి ఒక చిన్న పాప కూడా ఉంది. మియా ఖలీఫా ప్రస్తుతం మరొక వ్యక్తితో డేటింగ్‌లో ఉంది. అయితే అతని పేరును ఆమె వెల్లడించలేదు.సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నిజమని నమ్మకూడదనడానికి ఈ ఘటనే నిదర్శనం. మిస్టర్ బీన్, మియా ఖలీఫా డేటింగ్ చేస్తున్నారనే వార్త కేవలం ఒక సరదా కోసం పుట్టిన 'ఫేక్ న్యూస్' మాత్రమే.












Click it and Unblock the Notifications