సోషల్ మీడియాను ఊపేస్తున్న తమన్నా హాట్ సాంగ్!!
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల కంటే బాలీవుడ్ సినిమాల తోనే ఎక్కువ బిజీగా ఉంటున్నారు. గత సంవత్సరం జైలర్ సినిమాలో ఐటమ్ సాంగ్ తో అలరించిన తమన్నా భాటియా తాజాగా అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన హారర్ కామెడీ మూవీ స్త్రీ 2 సినిమాలో ఒక ఐటెం నెంబర్ తో అలరించారు.
సోషల్ మీడియాను ఊపేస్తున్న తమన్నా
బాటిల్ గ్రీన్ కలర్ డ్రెస్ లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా స్త్రీ 2 సినిమాలో "ఆజ్ కీ రాత్" అనే ఐటెం సాంగ్ చేసి అభిమానులను కట్టిపడేశారు. ఈ పాటలో తమన్నా భాటియా వేసిన స్టెప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ పాటకు స్టెప్పులేస్తూ వీడియోలను షేర్ చేస్తున్నారు.

ఎక్కడ చూసినా తమన్నా పాటే
ఇప్పుడు నెట్టింట తమన్నా భాటియా చేసిన ఈ సాంగ్ ఎక్కడ చూసినా దర్శనమిస్తుంది. ఈ పాటలో తమన్నా తన అందాలతోపాటు, హావభావాలతో, మంచి సిగ్నేచర్ స్టెప్స్ తో హల్చల్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చెయ్యగా ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను ఆగస్టు 15 న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
స్త్రీ 2 లో ఐటమ్ సాంగ్ తో అదరగొట్టిన తమన్నా
ఈ సినిమాలో పంకడ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా కీలక పాత్రలు పోషించారు. 2018 లో వచ్చిన స్త్రీ సినిమాలో నోరా ఫతేహి స్పెషల్ సాంగ్ చేసింది. స్త్రీ 2 సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి తమన్న భాటియాకు అవకాశం రావడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది తమన్నా. నోరా ఫతేహి డ్యాన్స్ కు ఏ మాత్రం తగ్గకుండా చేసింది.
బాలీవుడ్ లో భారీ అంచనాలు పెంచిన తమన్నా సాంగ్
స్త్రీ సినిమా హిట్ కావడంతో ఇప్పుడు దీన్ని సీక్వెన్స్ లో వచ్చిన స్త్రీ 2 కూడా హిట్ అవుతుంది అనే టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాకు తమన్నా భాటియా సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పాటతో తమన్నా భాటియా బాలీవుడ్ లో తన అంచనాలను భారీగా పెంచేసింది. ఈ పాటకు ఇప్పటికే యూట్యూబ్లో మిలియన్ల కొద్ది వ్యూస్ రాగా తమన్న భాటియా ఐటెం సాంగ్ జైలర్ సినిమాలో కావాలయ్యా పాట చేసిన మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications