నాగ చైతన్య వల్లే ఆ సినిమా ఫ్లాప్..దర్శకుడు షాకింగ్ కామెంట్స్
అక్కినేని నట వారసుడుగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. తాత, తండ్రి వారసత్వాన్ని నాగచైతన్య కొనసాగిస్తారని అభిమానులంతా భావించారు. అయితే నాగచైతన్య హీరోగా నిలబడటానికి నానా తంటాలు పడుతున్నాడు. నాగచైతన్య ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించాడు . కానీ హిట్ కొట్టింది మాత్రం చాలా చాలా తక్కువే అని చెప్పాలి. చైతన్య కెరీర్‌లో ఇప్పటి వరకు బ్లాక్ బ్లాస్టర్ హిట్ ఒక్కటి కూడా లేదు. హిట్ కొట్టిన సినిమాల్లో కూడా స్టోరీ పరంగాను హీరోయిన్ పరంగాను హిట్ అయినవే ఎక్కువ అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.
నాగచైతన్య వ్యక్తిగత జీవితం కూడా అంత గొప్పగా ఏం లేదు. హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య..కొద్దిరోజులకే ఆమెకు విడాకులిచ్చాడు. తర్వాత హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తూ..ఆమెను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవల వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఇదిలా ఉంటే నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యంత డిజాస్టర్‌గా 'కస్టడి' మూవీ నిలిచింది. అసలు ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా తెలియని పరిస్థితి. తాజాగా ఈ సినిమా ఫలితంపై దర్శకుడు వెంకట్ ప్రభు స్పందించారు.

ఈ సినిమాలో తన తప్పు ఏం లేదని వెంకట్ ప్రభు తెలిపారు. ఈ సినిమా కథలో నిర్మాతలు, హీరో ఇన్వాల్వ్ కావడంతోనే కస్టడి ఫ్లాప్‌గా నిలిచిందనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. 'మానాడు' వంటి బ్లాక్ బ్లస్టర్ తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన సినిమా కావడంతో కస్టడిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా ఘెరంగా ఫెయిల్ అయింది. దీంతో 'కస్టడి' నాగ చైతన్య కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఇక వెంకట్ ప్రభు తాజాగా ఇళయ దళపతి విజయ్ హీరోగా 'గోట్' అనే సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమా కూడా ప్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications