ఆగమనానికి ముహూర్తం ఫిక్స్.. ఎన్టీఆర్ - నీల్ మూవీ అప్పుడే..?

గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ - ప్రశాంత్ నీల్‌ కాంబినేషన్‌లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. గత ఏడాదిలో సినిమా పూజా కార్యక్రమాలు జరగగా.. రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్ ప్రారంభించారు. మొదటి షెడ్యూల్ తారక్ లేకుండానే ఫినిష్ చేసేశారు నీల్. గత మూడు రోజుల క్రితమే ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ చిత్రంలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు.

ఓ వైపు ఆర్ఆర్ఆర్, దేవర చిత్రాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు తారక్. మరోవైపు కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ చిత్రాల్లో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన ప్రశాంత్ నీల్ ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుండడంతో మూవీపై భారీ అంచనాలు నెలకున్నాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని తారక్ ఫ్యాన్స్ అంతా తెగ ఎదురు చసుతున్నారు. ఈ క్రమంలోనే అభిమానులకు ఎన్టీఆర్ ఓ తీపి కబురు చెప్పారు.

movie-reease-date-announced-for-jr-ntr-and-prashanth-neel-movie

సోషల్ మీడియా వేదికగా ప్రశాంత్ నీల్ తో చేస్తున్న మూవీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. 2026, జూన్ 25న మూవీ విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. దీంతో ఆయన ఫ్యాన్స్ అంతా ఈ పోస్టును షేర్ చేస్తూ ఫుల్ వైరల్ చేస్తున్నారు. అలాగే యంగ్ టైగర్ పుట్టిన రోజు కానుకగా మే 20న న సినిమా గ్లిమ్స్ రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు.

అయితే ఎన్టీఆర్ ఇటీవల కొంతకాలంగా బక్కచిక్కి కనిపిస్తున్నారు. మ్యాడ్‌ స్క్వేర్‌ సక్సెస్‌ మీట్‌లో, కళ్యాణ్‌ రామ్‌ 'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి' సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సన్నగా కనిపించారు ఎన్టీఆర్. దీంతో ఈ సినిమా కోసమే దాదాపు ఐదు నెలల్లోనే ఎన్టీఆర్ సుమారుగా 18 కేజీల బరువు తగ్గారని అంటున్నారు. రోజుకు మూడు గంటల పాటు వర్కౌట్ చేసి, ఫ్యాట్ ఎంకరేజ్ చేయకుండా హై ప్రోటీన్స్ తో ఎన్టీఆర్ డైట్ ను పాటించారని చెబుతున్నారు.

మరోవైపు ఈ ఏడాది ఆగస్టులో 'వార్‌ 2' సినిమాతో రాబోతున్నారు ఎన్టీఆర్. వార్‌ 2 సినిమాలో హృతిక్ రోషన్‌ హీరోగా నటిస్తూ ఉండగా.. కీలక పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ నుంచి ఎన్టీఆర్ పిక్స్ లీక్ అయ్యి వైరల్ గా మారాయి. త్వరలోనే వార్ 2 మేకర్స్ ఎన్టీఆర్‌ లుక్‌తో పాటు, టీజర్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రం ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ కావడంతో ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+