ఇదేం పద్దతి.. అభిమానిపై మండిపడ్డ మృణాల్ ఠాకుర్
మృణాల్ ఠాకుర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'సీతారామం' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారింది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో మృణాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది . తొలి సినిమాతోనే తన అందం అభినయంతో కట్టిపడేసింది. సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. తొలి సినిమాతోనే మంచి విజయం సాధించింది. ఆతర్వాత తెలుగులో ఈ అమ్మడి క్రేజ్ పెరిగిపోయింది.
మృణాల్ ఠాకూర్.. తెలుగులో తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఆతర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి 'హాయ్ నాన్న' అనే సినిమా చేసింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఆ తర్వాత 'ఫ్యామిలీ స్టార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ 'ఫ్యామిలి స్టార్' సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.కానీ మృణాల్ నటనకు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది.

తన నటనతో మరోసారి ఆకట్టుకుంది. ఇక తెలుగుతో పాటు, బాలీవుడ్ సినిమాల్లో కూడా వరుస ఆఫర్లు కొట్టేస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మృణాల్ ఠాకుర్ ఎప్పటికప్పుడు సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా తన వ్యక్తిగత అకౌంట్‌లో పోస్ట్ చేస్తుంటారు. అయితే తాజాగా ఆమె ఓ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీపావళి సందర్భంగా ఓ అభిమాని ఫ్యామిలీ స్టార్ మూవీలోని పోస్టర్‌ను ఎడిట్ చేశాడు.
విజయ్ దేవరకొండ స్థానంలో తన ఫొటోని మృణాల్ ఠాకుర్ పక్కన పెట్టుకున్నాడు. అయితే ఈ ఫొటోపై మృణాల్ ఠాకుర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ''బ్రదర్.. మీకు మీరే ఎందుకు తప్పుడు భరోసా ఇచ్చుకుంటున్నారు. మీరు చేసిన పని బాగుందనుకుంటున్నారా? ఇది అస్సలు బాలేదు'' అని రాసుకొచ్చింది. నెటిజన్లు మాత్రం మృణాల్‌కు సపోర్ట్‌గా కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మృణాల్ ఠాకుర్ ఇంతలా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మృణాల్ ఠాకుర్ ఫ్యాన్ ఎడిట్ చేసిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications