ఇంట్లో ఇలా ప్రవర్తిస్తే నా భార్య నన్ను కొడుతుంది...రణబీర్ కపూర్..
బాలీవుడ్‌లో చూడముచ్చటైన జంట రణబీర్ కపూర్, ఆలియాభట్.. వీరిద్దరూ ఏప్రిల్ 14, 2022న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి, పిల్లలు అయిన తర్వాత కూడా ఆలియాభట్ సినిమాలు చేస్తూ బిజి లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. ఇక, రణబీర్‌కపూర్ లేటేస్ట్ మూవీ యానిమల్ డిసెంబర్1, 2023న తెరపైకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. అయితే, ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఈవెంట్‌కు హాజరయిన రణబీర్ కపూర్ తన భార్య ఆలియాభట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈయన వ్యాఖ్యలు కాస్త సోషల్‌మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విడుదల తేదీ సమీపిస్తుండటంతో ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌తో సందడి చేసేస్తున్నారు. ఈ సినిమాలో రణబీర్‌కపూర్‌కి జోడిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన సంగతి అందరికే తెలిసిందే.. ఇప్పటికే ఈ మూవీ పోస్టర్‌ను, ఇందులోని పాటలను విడుదల చేశారు. అయితే, ఈ సినిమాలోని ఓ పాటలో రష్మిక, రణబీర్‌ల ముద్దు సీన్లే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే, ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ దేశమంతా చుట్టేస్తుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన సందర్భంగా చిత్ర యూనిట్ ఓ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈవెంట్‌లో రణబీర్ కపూర్ సినిమా గురించి మాత్రమే కాకుండా, తన వ్యక్తిగత జీవితం గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ఈవెంట్‌లో భార్యగురించి ప్రస్తావించిన రణబీర్ : ఈ సందర్భంగా తన భార్య ఆలియా భట్ గురించి ప్రస్తావించడం జరిగింది. ఆలియాభట్‌పై రణబీర్ కపూర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో తన పాత్రలతో తను చాలా డిటాచ్‌గా ఉంటానని రణబీర్ కపూర్ చెప్పుకొచ్చాడు. అది తమను ప్రేమించిన వారిపై మంచి ప్రభావం చూపించదని ఈ సందర్భంగా అన్నాడు. అంతే కాకుండా నేను ఇంట్లో కూడా ఇలాగే ప్రవర్తిస్తే నా భార్య నన్ను కొడుతుంది అని రణబీర్ ఓ ఫన్నీకామెంట్ చేశాడు. ఇప్పడు ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్‌మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ఈవెంట్‌కు రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగాతో పాటు బాబీ డియోల్, రష్మిక కూడా హాజరయ్యారు.












Click it and Unblock the Notifications