నాగచైతన్య- శోభితలను కలిపింది ఆ హీరోనే..? సమంతకు ఇంత అన్యాయామా..?
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం సింపుల్‌గా జరిగిన సంగతి తెలిసిందే.సమంత, నాగ చైతన్య ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. సమంత ఒంటిరిగా ఉండగా, నాగ చైతన్య మాత్రం విడాకుల తర్వాత శోభిత ధూళిపాళతో నాగ చైతన్య సైలెంట్‌గా డేటింగ్ చేశాడు. ఇప్పుడు ఏకంగా ఆమెను వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యాడు.
అతి కొద్దిమంది సమక్షంలో నాగ చైతన్య, శోభిత ధూళిపాళల నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది. ఈక్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించి కీలక ఘట్టం మొదలైంది.నాగ చైతన్య -శోభిత ధూళిపాళల పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. దీనిలో భాగంగానే శోభిత ధూళిపాళ నివాసంలో పసుపు కొట్టే కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను శోభిత ధూళిపాళ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో శోభిత ధూళిపాళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా పాల్గొన్నారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్ఆర్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి కాబోయే భార్య శోభిత ధూళిపాళతో కలిసి నాగ చైతన్య హాజరయ్యారు. శోభిత ధూళిపాళలను ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ పరిచియం చేశారు నాగ చైతన్య. ఈవెంట్‌లో నాగ చైతన్య - శోభిత ధూళిపాళ జంట స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే అసలు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ కలుసుకోవడానికి, వారు ప్రేమించుకోవానికి ఓ హీరో కారణమని తెలుస్తోంది. ఆ హీరో మరెవ్వరో కాదు అడవి శేషు.
శోభిత ధూళిపాళ అడవి శేష్‌తో కలిసి రెండు సినిమాల్లో నటించింది.గూడఛారి, మేజర్ సినిమాల్లో వీరు కలిసి నటించారు. గూడఛారి సినిమాలో నాగార్జున మేన కోడలు సుప్రియ కీలక పాత్రలో కనపించారు. ఆ సినిమా షూటింగ్ చూద్దామని వెళ్లిన నాగ చైతన్యకు శోభిత పరిచియం కావడం, ఆ పరిచియం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది. ఇలా నాగచైతన్య - శోభితల పెళ్లి జరగడానికి కారణమయ్యాడు అడవి శేష్ అంటూ టాలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియదు కానీ.. దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications