పదే పదే ఫోన్ కాల్... సమంత నెంబర్ బ్లాక్ చేసిన నాగచైతన్య

దక్షిణాది బ్యూటీ సమంత నటించిన హనీబన్నీ వెబ్ సిరీస్ ఈనెల ఏడోతేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ప్రేక్షకాదరణ మాత్రం బాగుంది. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై, నాగచైతన్యతో ప్రేమలో పడింది. ఎవరికీ తెలియకుండా ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో ఒకటయ్యారు. తర్వాత అదే పెద్దలకు చెప్పిన మనస్పర్థలు వచ్చాయని, విడిపోతున్నామని చెప్పి విడాకులు తీసుకున్నారు. మయోసైటిస్ సోకడంతో ఏడాదిన్నర సమయం సినిమాలకు విరామం ప్రకటించడంతో ఇప్పుడు సినిమాల నుంచి అవకాశాలు రావడంలేదు. దీంతో వెబ్ సిరీస్ లు చేస్తోంది. తన సొంత బ్యానరులతో మాఇంటి బంగారం పేరుతో ఓ సినిమా చేస్తోంది.

షూటింగ్ స్పాట్ కు వచ్చేసిన సమంత
తాజాగా సమంత-నాగచైతన్యకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరూ ప్రేమించుకునే సమయంలో చాలా సరదాగా ఉండేవారు. అలాగే సరదాగా సమయం గడిపేవారు. సాధారణంగా అందరు ప్రేమికుల్లానే వీరిద్దరూ తరుచూ గొడవలు పడుతుంటారు. నాగచైతన్య ఓ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సమయంలో సమంత పదే పదే ఫోన్ చేసి విసిగించేదంట. దీంతో విసుగొచ్చిన నాగచైతన్య సమంత నెంబరును బ్లాక్ చేశాడు. తర్వాత ఫోన్ చేసినా బ్లాక్ చేసినట్లు అర్థం కావడంతో కోపం వచ్చిన సమంత నేరుగా షూటింగ్ జరిగే స్పాట్ కే వచ్చేసిందంట. తాను కారులో కూర్చొని షూటింగ్ నుంచి నాగచైతన్యను బయటకు పిలిపించి మాట్లాడింది. సమంతను కూడా నాగచైతన్య కూడా కోపం మరిచిపోయి సారీ చెప్పాడు. ప్రస్తుతం ఈ వార్త వైరలవుతోంది.

Naga Chaitanya blocked Samantha s phone number as she kept calling him

ఫిబ్రవరి ఏడున తండేల్
ఆగస్టు ఎనిమిదో తేదీన శోభిత ధూళిపాళతో నాగచైతన్య నిశ్చితార్థం చేసుకున్నాడు. పసుపు దంచే కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను కూడా శోభిత షేర్ చేయడంతో వివాహ తేదీ కూడా దగ్గరలోనే ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం తండేల్ సినిమా చేస్తున్న నాగచైతన్య తర్వాత చేసే సినిమాను ఇంకా ప్రకటించలేదు. ఈ సినిమా ఫిబ్రవరి ఏడోతేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదలకు ముందుకానీ, విడుదల తర్వాతకానీ శోభితతో వివాహం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+