సమంతతో అందుకే విడిపోయా..ఇన్నాళ్లకు ఓపెన్ అయిన నాగ చైతన్య

హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే.హీరో నాగచైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య, సమంతలు 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇండస్ట్రీలో బెస్ట్ జోడిగా ఉంటారనుకునేలోపే వీరు విడిపోయారు. పెళ్లైనా కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.

వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు.విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరు తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకున్నారు.

naga chaitanya open comments on divorce with samantha

సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య శోభితతో రిలేషన్‌లో ఉన్నాడు. నాగ చైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకున్నాడు.ఈక్రమంలోనే సైలెంట్‌తో శోభితను రెండో వివాహం చేసుకున్నాడు.సమంత ప్రస్తుతం ఒంటరికి ఉంటున్నారు.నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. క్లైమాక్స్‌లో నాగ చైతన్య అద్భుతంగా నటించారని ప్రేక్షకులు చెబుతున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సమంతతో విడాకులు గురించి నాగ చైతన్య స్పందించారు.బ్రేకప్ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునని,నేను కూడా అనుభవించానని నాగ చైతన్య చెప్పుకొచ్చాడు.నేను కూడా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను.నేను సమంత ఒక్క రాత్రిలో ఈ నిర్ణయం తీసుకోలేదని, విడిపోదామనే పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఎన్నిసార్లు ఆలోచించామని, మా నిర్ణయం సరైంది అనుకున్న తర్వాతే మేము ఇద్దరం ఇష్టపడే విడిపోయమని నాగ చైతన్య తెలిపారు.

విడాకుల తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నాము. అయ్యాము..ఎవరి జీవితాలు వాళ్లు చూసుకుంటున్నామని చైతన్య పేర్కొన్నారు. అసలు ఇలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి వరకు తెచ్చుకోకూడదు.. కానీ అలా చేయాల్సి వచ్చింది.. ఏం జరిగినా ప్రతి దానికి ఓ కారణం ఉంటుందని నాగ చైతన్య సమంతతో జరిగిన డివోర్స్ గురించి చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+