నిహారిక మాజీ భర్త రెండో పెళ్లి? అమ్మాయి ఎవరంటే..?
సెలబ్రిటీల వివాహాలు, విడాకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడు? ఎవరిని ప్రేమిస్తారో? ఎవరిని పెళ్లి చేసుకుంటారో, ఎప్పుడు విడిపోతారో చెప్పడమనేది చాలా కష్టం. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో విడాకుల ట్రెండ్ నడుస్తోంది. ఈ ఏడాది విడాకులు తీసుకొని టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు నాగబాబు కుమార్తె నీహారిక. 2020లో ఆమె వివాహాన్ని జొన్నలగడ్డ చైతన్యతో ఘనంగా జరిపించారు.
రెండు సంవత్సరాల సమయం ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంది. ఆ తర్వాతే వీరిమధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. గత ఏడాది విడాకులకు దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది మంజూరయ్యాయి. విడిపోతున్నట్లు ఇద్దరూ ప్రకటించారు. విడాకుల తర్వాత నీహారిక కొంత గ్యాప్ తీసుకొని తన కెరీర్ వైపు పయనిస్తోంది. మరోవైపు చైతన్య డిప్రెషన్ లోకి వెళ్లడంవల్ల కొన్ని ఆశ్రమాలు తిరిగి కొంతవరకు కోలుకొని ఇప్పుడే బయటకు వస్తున్నాడు.

జొన్నలగడ్డ చైతన్య రెండో పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. చైతన్య తల్లిదండ్రులు వారి కుటుంబంలో వరుసయ్యే అమ్మాయిని వెతికారని, తన కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ఐపీఎస్ అధికారి కూతురితో చైతన్య రెండో వివాహం జరగబోతోందని వార్తలు వస్తున్నాయి. అందుకు చైతన్య కూడా అంగీకరించాడంటున్నారు. అన్నీ చక్కగా కుదిరితే బంధుమిత్రుల సమక్షంలో సింపుల్ గా ఈ వివాహం జరిపించాలని యోచిస్తున్నారు.
నీహారిక గతంలో సినిమాల్లో నటించడంతోపాటు వెబ్ సిరీస్ లు కూడా చేశారు. వాటికి అనుకున్నంత స్థాయిలో ఆదరణ దక్కకపోవడంతో నిర్మాతగా తన కెరీర్ ను మార్చుకునే క్రమంలో ఉన్నారు.












Click it and Unblock the Notifications