వృద్ధ అభిమానిని తోసేసిన బాడీగార్డ్.. క్షమాపణలు చెప్పిన నాగార్జున..
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఓ అభిమానికి క్షమాపణలు చెప్పారు. తన బాడీగార్డ్ చేసిన పనికి కింగ్ నాగార్జున సోషల్ మీడియా వేదికగా ఆ అభిమానికి క్షమాపణలు చెప్పారు. అసలు ఏం జరిగిందంటే...
నటుడు నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న'కుబేర' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా హైదారబాద్ షెడ్యూల్ కోసం వచ్చాడు. ఇక, ఈ సినిమాలో కింగ్‌తో పాటు ధనుష్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జునతో పాటు ధనుష్ కూడా వచ్చాడు. అయితే, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఈ ఇద్దరు హీరోలు నడుచుకుని వస్తుండగా, నాగార్జునను చూసిన అక్కడి ఎయిర్‌పోర్టు సిబ్బందిలో ఒక ముసలి వ్యక్తి ఎంతో ఆత్రుతతో నాగ్ దగ్గరికి వచ్చాడు. నాగార్జునకు మరింత దగ్గరికి రావడంతో పక్కనే ఉన్న బాడిగార్డ్ ఆయనను ఆ వృద్ధ వ్యక్తిని పక్కకు నెట్టారు. దీంతో ఆయన అదుపు తప్పి కింద పడపోయాడు. ఇంతలో తమాయించుకుని నిలబడ్డారు. అయితే, దీనికి సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. అంతేకాదు, ఈ సంఘటన కాస్తా నాగార్జున దృష్టికి వెళ్లింది. దీంతో స్వయంగా 'కింగ్' ఈ వీడియోపై రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎక్స్‌వేదికగా ఆ వృద్ధ అభిమానికి నాగార్జున క్షమాపణలు చెప్పాడు. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని చెప్పాడు.

వైరల్ అవుతోన్న నాగార్జున ట్వీట్..
నాగార్జున ఫోస్ట్ చేసిన ట్వీట్‌లో ఇలా రాసి ఉంది. ఇప్పుడే ఈ వీడియో నా దృష్టికి వచ్చింది. ఇలా జరగాల్సింది కాదు!! నేను పెద్దాయనికి క్షమాపణలు చెబుతున్నా. అలాగే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్త తీసుకుంటాను!!" అంటూ నాగార్జున్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ కాస్తా వైరల్ అవుతుంది. ప్రస్తుతం నాగార్జున డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేర మూవీ షూటింగ్ పనుల్లో ఉన్నారు. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో ధనుష్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా నాగార్జున, ధనుష్‌లు కలిసి హైదరాబాద్ ఎయిరోపోర్టుకి చేరుకున్న నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది.
Where has humanity gone? #nagarjuna pic.twitter.com/qnPjJngIxM
— Viral Bhayani (@viralbhayani77) June 23, 2024
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications