నాగచైతన్యతో పూజలు చేయిస్తున్న నాగార్జున?
అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా తండేల్ చేస్తున్నాడు. ఇందులో సాయిపల్లవి కథానాయిక. గీతాఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. నాగచైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే చిన్న చిన్న మనస్పర్థల వల్ల ఇద్దరూ విడిపోయారు. విడాకుల తర్వాతే ఈ జంట మరింత పాపులరైంది. కొడుక్కి రెండో పెళ్లి చేయాలని అక్కినేని నాగార్జున ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ నాగచైతన్య మాత్రం ఇష్టపడంలేదు.
వరుసగా సినిమాలు చేస్తూ హిట్లు కొట్టడం మాత్రమే తన ధ్యేయం అని స్పష్టంగా చెబుతున్నాడు. అయితే నాగచైతన్యకు, సమంతకు వివాహం జరిగే సమయంలోనే జ్యోతిష్యులు నాగచైతన్య జాతకంలో గండం ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. ఆ జాతకానికి పరిష్కారం చేయాలని లేదంటే విడిపోతారని చెప్పారంట. అయితే అటువంటి జాతకాలను తాను నమ్మనని, తన ఇష్టం ప్రకారమే ముందుకు సాగుతానని నాగార్జునకు స్పష్టంగా చెప్పాడు.

వారు చెప్పినట్లుగా పూజలు చేయిస్తే నాగచైతన్య జీవితం బాగుంటుందని నాగార్జున నమ్ముతున్నాడు. దీంతో పూజలపై నాగచైతన్యను ఒప్పించి కొడుక్కి వివాహం కుదర్చాలనే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తోంది. అయితే అభిమానులు మాత్రం ఈ వార్తను కొట్టేస్తున్నారు. నాగచైతన్య ఇప్పటికీ సమంతను ప్రేమిస్తున్నాడని, సమంతతో తిరిగి కలిసిపోవాలనుకుంటున్నాడని, అందుకే రెండో పెళ్లికి ఆసక్తి చూపించడంలేదంటున్నారు. ఆయన జాతకంలో ఉన్న గండం ప్రకారం పూజలు, ఆ గండానికి పరిష్కారం చేయించకుండా తిరిగి వివాహం చేసినా మళ్లీ మొదటి పరిస్థితే తలెత్తుతుందని, అందుకే పూజలు చేయించిన తర్వాతే వివాహం కుదర్చాలనే యోచనలో నాగార్జున ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిల్లో ఎంత వాస్తవం ఉందో, నాగచైతన్య తిరిగి రెండో పెళ్లి చేసుకుంటాడా? అనే సమస్యలకు కాలమే సమాధానం చెప్పనుంది.












Click it and Unblock the Notifications