నాగార్జునకు నడుం గిల్లే అలవాటు..అందుకే ఆయన్ను రిజెక్ట్ చేశా.. స్టార్ హీరోయిన్
హీరో నాగార్జున గురించి ఇండస్ట్రీలో ఎవరినైనా అడిగితే ఆయన నట సామ్రాట్ నాగేశ్వరరావు కుమారుడని, మన్మథుడని, గ్రీకు వీరుడని , అమ్మాయిల కలల రాకుమారడని ఇలా రకరకాలుగా చెబుతుంటారు. అక్కినేని నాగేశ్వరరావు కొడుగ్గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాగార్జున తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సొంతం చేసుకున్నారు.

వెండితెర మీదే కాదు.. బుల్లితెర మీద కూడా తనకు ఎవరు పోటీ లేరని బిగ్‌బాస్ షోతో మరోసారి నాగార్జున నిరుపించుకున్నారు. హీరోయిన్లందరూ కూడా నాగార్జునతో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించాలని కోరుకుంటారు. అలాంటిది ఓ హీరోయిన్ నాగార్జున సినిమాను రిజెక్ట్ చేశానని చెప్పి సంచలనం సృష్టించింది. నాగార్జునతో సినిమా గురించి ఆ నటి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో కాకరేపుతున్నాయి.

నాగార్జున గురించి కామెంట్స్ చేసిన సీనియర్ హీరోయిన్ మరెవ్వరో కాదు సీనియర్ నటి నదియా.నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో తొలుత రమ్యకృష్ణ స్థానంలో నదియాను సంప్రదించాడట దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. ఈ సినిమాలో నాగార్జున తరచూ హీరోయిన్ నడుం గిల్లుతూ ఉంటారు.మాటి మాటికి నడుము గిల్లించుకోవడం ఇష్టం లేనటువంటి నదియా ఈ సినిమాను రిజెక్ట్ చేశారట. నదియా తప్పుకోవడంతో ఆ అవకాశం రమ్యకృష్ణను వరించింది. ఆ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన సోగ్గాడే చిన్నినాయన ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో మనకు తెలిసిందే.












Click it and Unblock the Notifications