గంగవ్వ కంటే నాగార్జున పెద్దవారా..? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..?
హీరో నాగార్జున గురించి ఇండస్ట్రీలో ఎవరినైనా అడిగితే ఆయన నట సామ్రాట్ నాగేశ్వరరావు కుమారుడని, మన్మథుడని, గ్రీకు వీరుడని , అమ్మాయిల కలల రాకుమారడని ఇలా రకరకాలుగా చెబుతుంటారు. అక్కినేని నాగేశ్వరరావు కొడుగ్గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాగార్జున తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. వెండితెర మీదే కాదు.. బుల్లితెర మీద కూడా తనకు ఎవరు పోటీ లేరని బిగ్‌బాస్ షోతో మరోసారి నాగార్జున నిరుపించుకున్నారు.
నాగార్జున తప్పిస్తే మరెవ్వరూ ఈ షోను హోస్ట్ చేయలేరనే విధంగా ఆయన బిగ్‌బాస్ షోను నడిపిస్తున్నారు. ఇక ఆరు పదుల వయస్సులో కూడా నవ మన్మథుడుగా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. తాజాగా నాగార్జునకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. బిగ్‌బాస్ కంటెస్ట్ గంగవ్వ , నాగార్జున వయస్సు గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. గంగవ్వ కంటే నాగార్జున వయస్సులో పెద్దవాడంటూ ప్రచారం జరుగుతోంది.

కానీ నిజానికి గంగవ్వ నాగార్జున కంటే చిన్నదే అని తెలుస్తోంది. వయస్సులో గంగవ్వ కంటే నాగార్జున పెద్దవారట నాగార్జున గంగవ్వ కంటే మూడేళ్ళు పెద్దవారు. గంగవ్వ వయస్సు 62 ఏళ్లు కాగా.. నాగార్జున వయసు 65 ఏళ్లు. కానీ ఆమె పెద్దదానిలా కానిపిస్తున్నారు. నాగార్జున హీరో కావడంతో.. ఆయన ఫిట్ నెస్, ఫుడ్ మెయింటేనెస్ తో ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం రివర్స్‌లో కనిపిస్తుంది.
నాగార్జున హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇదే సమయంలో ఫిజిక్ మెయిన్‌టైన్ చేయడంలో కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. దీని వల్లే ఆయన నేటికి కూడా చాలా యంగ్‌గా కనిపిస్తుంటారు. ఇక గంగవ్వ విషయానికి వస్తే..ఆమె చిన్నతనం నుంచి చాలా కష్టాలు పడింది.పిల్లల్ని పెంచి పెద్ద చేసి.. పెళ్లిళ్ళు కూడా చేసింది. దాంతో ఆమె ఆరోగ్యం గురించి ఎప్పుడు పట్టించుకోలేదు.
ఇక బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన గంగవ్వ ఎక్కువ రోజులు షోలో కొనసాగలేకపోయింది.ఆరోగ్యం సహకరించకపోవడంతో షో మధ్య నుంచే ఆమె బయటకొచ్చేశారు. తాజాగా జరుగుతున్న సీజన్‌లో ఆమె మరోసారి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టారు. గతంలో గంగవ్వకు ఇల్లు లేదనే విషయం తెలుసుకున్న నాగార్జున ఆమెకు తన సొంత డబ్బుతో ఇల్లు కూడా కట్టించారు.












Click it and Unblock the Notifications