తెలుగులో ఏకైక హీరోగా అరుదైన రికార్డ్ నెలకొల్పిన బాలయ్య

నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా కొల్లి బాబీ దర్శకత్వంలో రూపొందిన డాకూ మహారాజ్ 12వ తేదీన విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య రూ.100 కోట్ల బడ్జెట్ తో దీన్ని నిర్మించారు. విడుదలైన మొదటిరోజు మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రోజురోజుకు మంచి జోష్ ను కనపరుస్తోంది. అంతేకాదు.. ఈ సినిమాతో నందమూరి బాలకృష్ణ తెలుగులో ఏ హీరోకు సాధ్యంకాని ఒక అరుదైన రికార్డును నెలకొల్పారు. ఓవర్సీస్ లో వరుసగా నాలుగో సినిమాతో కూడా వన్ మిలియన్ డాలర్ల కలెక్షన్లు రాబట్టారు.

అరుదైన రికార్డును సృష్టించిన బాలయ్య
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలు విదేశాల్లో ఒక మిలియన్ డాలర్లను చాలా సులువుగా రాబట్టాయి. తాజాగా డాకూ మహారాజ్ సినిమా తొలిరోజే ఓవర్సీస్ లో ఒక మిలియన్ డాలర్ల కలెక్షన్లు కొల్లగొట్టి అరుదైన రికార్డును నెలకొల్పింది. తెలుగులో ఇంతవరకు ఏ స్టార్ హీరో కూడా వరుసగా నాలుగు సినిమాలో వన్ మిలియన్ డాలర్లను రాబట్టలేకపోయారు. అత్యంత అరుదైన రికార్డును నెలకొల్పిన బాలకృష్ణ రికార్డుపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బోయపాటి శ్రీను ఒక్కడే బాలయ్యకు హిట్ ఇస్తాడు అనే ముద్ర చెరిగిపోయిందని, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, కొల్లి బాబీ కూడా బాలయ్యకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చారని గుర్తుచేస్తున్నారు.

nandamuri balakrishna is one and only hero to create new record in telugu film industry

మూడు రోజులకే రూ.92 కోట్లు
డాకూ మహారాజ్ విడుదలైన మూడు రోజులకే 92 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు నిర్మాణ సంస్థ పోస్టర్ విడుదల చేసింది. నాలుగో రోజుకు రూ.100 కోట్లను సాధించబోతోంది. లాంగ్ రన్ లో ఈ సినిమా రూ.200 కోట్ల కలెక్షన్లు సాధిస్తుందని, బాలయ్య తొలి రూ.200 కోట్ల సినిమాగా నిలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వీరసింహారెడ్డి రూ.134 కోట్లు, భగవంత్ కేసరి రూ.132 కోట్లు సాధించగా, డాకూ మహారాజ్ మూడు రోజులకే 92 కోట్లరూపాయలను సాధించింది. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ తోపాటు ప్రతినాయకుడిగా బాబీడియోల్, రిషి, చాందినీ చౌదరి, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్ , హిమజ తదితరులు నటించారు. సంగీత దర్శకుడు తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమా విజయానికి దోహదం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+