చిరంజీవికి షాక్ ఇచ్చిన తెలుగు యువ హీరోలు

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కొల్లి బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమాను చేస్తున్నారు. దీనికి సంబంధించిన గ్లింప్స్ ను ఇటీవలే విడుదల చేయగా విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో హ్యాట్రిక్ సాధించి మంచి జోరుమీదున్న బాలయ్య తన 109వ సినిమాను కూడా బ్లాక్ బస్టర్ చేయాలని చూస్తున్నారు. కచ్చితంగా హిట్ అవుతుందంటూ బాలయ్య అభిమానులు చెబుతున్నారు. మొదటి నుంచి పూర్తిగా మాస్ సినిమాలు చేసుకుంటూ వస్తున్న బాలకృష్ణ అందులోనే వైవిధ్యభరితమైన పాత్రలను పోషించుకుంటూ ముందుకు సాగుతున్నారు.

థియేటర్లలోఈలలు వేసేవారు
సినీ పరిశ్రమ అనగానే అందరూ టాప్ హీరోలు ఉంటారు. యువ హీరోలు ఉంటారు. మనదగ్గర ఉన్న యువ హీరోల్లో నాగశౌర్య, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, కిరణ్ అబ్బవరం తన చిన్నతనం నుంచి బాలయ్య సినిమాలు చూస్తూ పెరిగారు. వారు పరిశ్రమలోకి వచ్చి హీరోలుగా మారినప్పటికీ వీరికి మాత్రం అభిమాన హీరో బాలకృష్ణ. అందరి హీరోలపై అభిమానం ఉన్నప్పటికీ బాలయ్య అంటే మరింత ఉత్సాహం చూపిస్తారు. చిన్నతనంలో బాలకృష్ణ సినిమా చూడటానికి థియేటర్ కు వెళ్లినప్పుడు ఆయన చెప్పే డైలాగులకు, ఫైట్లకు తాము ఈలలు వేసి కేరింతలు కొట్టేవారిమని పలు సందర్భాల్లో చెప్పారు. వాస్తవానికి యువ హీరోలు చిరంజీవి ఆదర్శమంటూ చెబుతుంటారు. అయితే వీరంతా బాలయ్య అని చెప్పడంతో చిరుకు షాక్ ఇచ్చినట్లవుతుందంటున్నారు.

nandamuri balakrishna is the favourite hero of all these heroes in telugu industry

రెండో కుమార్తె నిర్మాతగా
ఇలా తనదైన శైలిలో డైలాగులు చెబుతూ యువ హీరోలను కూడా తన అభిమానులుగా మలచుకున్న బాలకృష్ణ ఇటీవలే జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. ఎన్నికల సమయంలో సినిమాలకు కాస్తంత విరామం ప్రకటించారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తికాగానే మరోసారి బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించబోతున్నారు. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. బాలయ్య రెండో కూతురు ఈ సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. అఖండ కు పార్ట్2 తీస్తున్నారా? లేదంటే కొత్త కథా అనేది మాత్రం స్పష్టత రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+