ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ అనేవారు.. ఇప్పుడు బాలకృష్ణ, చిరంజీవి అంటున్నారు!
తెలుగు సినీ పరిశ్రమలో రెండో తరానికి సంబంధించి నలుగురు అగ్ర కథానాయకులున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. వీరికి ధీటుగా రాజశేఖర్ కూడా బాగా రాణించారుకానీ కొన్ని కారణాలవల్ల, తెరవెనక రాజకీయాలవల్ల తర్వాత వెనకబడ్డారు. గతంలో ఈ నలుగురు అగ్ర కథానాయకులు సినిమాలు చేస్తున్నప్పుడు చిరంజీవి తర్వాత బాలకృష్ణ అనే వారు. మొదటి స్థానంలో చిరంజీవి ఉంటే రెండో స్థానంలో బాలకృష్ణ ఉన్నాడని అర్థం. చిరంజీవి పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లారు. రాజకీయాలు తన మనస్తత్వానికి సరిపడలేదని వెనక్కి వచ్చేశారు.
అఖండ నుంచి తిరుగులేకుండా ఉంది
మిగతా ముగ్గురు మాత్రం సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైన తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమా చేశారు చిరు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. చిరంజీవి తన స్థానాన్ని కోల్పోలేదు.. అలాగే ఉంది అని అందరూ అనుకున్నారు. అయితే రెండో ఇన్నింగ్స్ లో చిరు చేసిన సినిమాలన్నీ ఫ్లాపయ్యారు. హిట్ అయిన సినిమాలు రెండే. ఒకటి ఖైదీ నెంబరు 150కాగా, మరొకటి వాల్తేరు వీరయ్య. అంటే చిరంజీవి కెరీర్ ఎలా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో బాలయ్య హవా సాగుతున్నప్పటికీ అఖండ నుంచి మాత్రం తిరుగులేకుండా ఉంది. అఖండ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహారాజ్ సినిమాలు చేసి సూపర్ హిట్లు అందించాడు.

తొలిసారిగా పాన్ ఇండియా సినిమాగా..
ఇప్పుడు అఖండ2 విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది బాలయ్య కెరీర్ లో తొలిసారిగా పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతోంది. ఇది హిట్ అయితే బాలయ్య క్రేజ్ మరింత పెరుగుతుంది. ఇప్పటికే అన్ స్టాపబుల్ షో చేయడంద్వారా నేటి తరానికి కూడా బాగా దగ్గరయ్యారు. యువత కూడా జై బాలయ్యా అంటూ పబ్బుల్లో కూడా పాటలు పాడుతోంది. ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ అన్నవారే.. ఇప్పుడు బాలకృష్ణ, చిరంజీవి అంటున్నారు.
గతంలోలా నెంబర్ వన్ స్థానం శాశ్వతంగా ఉండటలేదు. ఇప్పుడు ఒక హీరో సినిమా విడుదలై మంచి కలెక్షన్లు సాధిస్తే మరో సినిమా విడుదలయ్యే వరకు అతనే నెంబర్ వన్ హీరో. ఆ సమయం వరకే అతను మొదటి స్థానంలో ఉంటాడు. అయితే ప్రస్తుతం అగ్ర కథానాయకుల్లో ఒకడైన బాలయ్య మిగతా ముగ్గురు హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కన్నా చాలా ముందంజలో ఉన్నాడని చెప్పొచ్చు. అఖండ2 కూడా బ్లాక్ బస్టర్ అయితే బాలయ్యను పట్టుకోవడం ఎవరివల్లా కాదేమో అనిపిస్తోంది.












Click it and Unblock the Notifications