జూనియర్ ఎన్టీఆర్ - కల్యాణ్ రామ్ మధ్య పుల్లలు?

నందమూరి అన్నదమ్ములు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా ఉంటారు. పెద్ద సోద‌రుడు నందమూరి జానకిరామ్ మృతిచెందిన తర్వాత వీరిద్దరూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటున్నారు. నిర్మాతగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కల్యాణ్ రామ్ బ్యానర్ లో తక్కువ బడ్జెట్‌లో జై లవకుశ సినిమా తీసి ఆర్థిక క‌ష్టాల నుంచి గట్టెక్కేలా చేశాడు.

ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రంతోపాటు ప్రశాంత్ నీల్‌ సినిమాకు కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ కల్యాణ్ రామ్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. తాజాగా కల్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమా ఈనెల 29న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా కల్యాణ్ రామ్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ తనది మాత్రమే కాదని, తమ్ముడు ఎన్టీఆర్‌ది కూడా అన్నారు.

nandamuri kalyanram about his brother junior ntr

ఆ బ్యానర్ పై సినిమా చేస్తున్నప్పుడు తాను కేవలం పర్యవేక్షకుడిగా మాత్రమే ఉంటానని, తమ్ముడు ఏం చేస్తాడో తనకు తెలుసన్నారు. ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే ఉంటానని, ఊరికే వేలుపెట్టి కెలక‌టం తనకు ఇష్టంలేదని, తమ్ముడు రేంజ్ ఏమిటో అందరికీ తెలుసన్నారు. తారక్ చిన్నపిల్లాడు కాదు కదా.. మధ్యలోకి వెళ్లి.. నేను పుల్లలు పెట్టను అని స్పష్టం చేశాడు.

సినిమాల వరకు మాత్రమే కాదని, నిజజీవితంలో కూడా తమ బంధం అలాగే కొనసాగుతుందని, సినిమా చూసి తనకు నచ్చితేనే ట్వీట్ చేస్తారని, తాను దేన్నిగురించి అడగనన్నారు. డెవిల్ ట్రైలర్ పై ట్వీట్ చేయాలా? వద్దా? తనిష్టమని, అంతేకానీ ఇదే బంధానికి కొలమానం అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం ఉండదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+