నేచురల్ స్టార్ నాని సినిమాకు కాపీ సెగ!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ది ప్యారడైజ్' ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన మొదటి సింగిల్ "ఆయా షేర్" యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో రికార్డులు సృష్టిస్తోంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మాస్ బీట్, సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీలో నాని వేసిన సిగ్నేచర్ హుక్ స్టెప్పుకు ప్రేక్షకులు, ముఖ్యంగా యువత ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో ఎక్కడ చూసినా ఈ స్టెప్పే కనిపిస్తోంది. అయితే ఈ జోరు మీద ఉన్న సాంగ్‌కు ఇప్పుడు ఊహించని వివాదం చుట్టుముట్టింది.

కాపీ కొట్టారు..ప్రముఖ డ్యాన్సర్ సంచలన ఆరోపణలు
ప్రముఖ డ్యాన్సర్, సోషల్ మీడియా సెలబ్రిటీ బాబా జాక్సన్ (యువరాజ్ సింగ్) ఈ పాటలోని వైరల్ స్టెప్పుపై సంచలన ఆరోపణలు చేశారు. తన ప్రత్యేకమైన డ్యాన్స్ మూమెంట్స్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన.. నాని వేసిన హుక్ స్టెప్పు తన సొంత ఐడియా అని, దాన్ని చిత్ర బృందం కాపీ చేసిందని ఆరోపించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ చేస్తూ, "వారు నా స్టెప్పును కాపీ కొట్టారు" అంటూ ఘాటుగా స్పందించారు.

Nani Aaya Sher Step Controversy Baba Jackson Accuses The Paradise Team of Plagiarism Details

వీడియోను షేర్ చేసిన బాబా జాక్సన్
ఈ వివాదానికి బలం చేకూర్చేలా బాబా జాక్సన్ ఒక వీడియోను కూడా షేర్ చేశారు. అందులో తను గతంలో చేసిన ఒక పాత రీల్‌ను.. నాని వేసిన 'ఆయా షేర్' స్టెప్పును పక్కపక్కన పెట్టి చూపించారు. ఈ రెండు స్టెప్పుల మధ్య ఉన్న పోలికలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడంతో నాని ఫ్యాన్స్, బాబా జాక్సన్ ఫాలోవర్ల మధ్య సోషల్ మీడియా వేదికగా యుద్ధం మొదలైంది.

నాని ఫ్యాన్స్ కౌంటర్
అయితే నాని అభిమానులు ఈ ఆరోపణలను తిప్పికొడుతున్నారు. బాబా జాక్సన్ కూడా మైఖేల్ జాక్సన్ స్టైల్‌ను అనుకరిస్తారని.. ఆయన పేరులో కూడా 'జాక్సన్' ఉందని గుర్తు చేస్తున్నారు. దీనిపై స్పందించిన బాబా జాక్సన్, "నేను కాపీ చేయను.. అప్‌గ్రేడ్ చేస్తాను" అంటూ ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. డ్యాన్స్ రంగంలో కొన్ని మూమెంట్స్ ఒకదానికొకటి పోలి ఉండటం సహజమేనని.. చిన్న పోలిక ఉన్నంత మాత్రాన దాన్ని చౌర్యం అనలేమని డ్యాన్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ వివాదంపై స్పందించని చిత్రబృందం
ప్రస్తుతానికి ఈ వివాదంపై 'ది ప్యారడైజ్' చిత్ర బృందం కానీ, హీరో నాని కానీ, కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్ కానీ స్పందించలేదు. ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ వంటి పెద్ద షోలతో గుర్తింపు తెచ్చుకున్న బాబా జాక్సన్ చేసిన ఈ ఆరోపణలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. మరి చిత్ర యూనిట్ ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+