అహకారంతో మరోసారి ఎగిరిపడ్డ నయనతార
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి దక్షిణాదిలో ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాకు రూ.12 నుంచి రూ.15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకొని ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఇటీవలే ఆమె వివాహ వేడుకకు సంబంధించిన వీడియో నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రసారమైంది. బియాండ్ ది ఫెయిరీ టేల్ పేరుతో ప్రసారమైన ఈ కార్యక్రమంలో నయనతార జీవిత విశేషాలతోపాటు విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకోవడం వరకు అన్ని విషయాలు ఉన్నాయి. దీన్ని చూసిన ప్రముఖులంతా చాలా బాగుందని కొనియాడారు. అయితే ఈ డాక్యుమెంటరీ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
బయట కూడా అవే విమర్శలు
ధనుష్ సొంత సినిమాలో నటించిన నయనతార.. ఆ సినిమాలోని మూడు విజువల్స్ ను కూడా ఇందులో వాడుకున్నారు. ఆ సినిమా నుంచే విఘ్నేష్ శివన్ తో నయన్ ప్రేమలో పడింది. అయితే వీటిని ఉపయోగించుకోవడంపై అభ్యంతరం చెబుతూ ధనుష్ కోర్టుకు వెళ్లారు. అతనిపై నయనతార తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అలా గొడవ జరుగుతుండగానే మరో వివాదం రాజుకుంది. నయనతార అంటేనే అహంకారానికి నిర్వచనమని కొందరు చెబుతుంటారు. అందులో వాస్తవమెంతో వారికే తెలియాలి. బయట కూడా ఆమెపై అలాంటి విమర్శలే ఉన్నాయి. ఎవరినీ లెక్కచేయదని, ఎందుకంత అహంకారమని కొందరు ప్రశ్నిస్తుంటారు.

నయనతార క్షమాపణలు చెప్పాలి
తన సంపాదనతో వ్యాపారంలోకి అడుగుపెట్టిన నయనతార ఫెమీ9 శానిటరీ నాప్ కిన్స్ కంపెనీని ప్రారంభించింది. దీంతోపాటు బ్యూటీ ప్రొడక్ట్స్, లిప్ కేర్ కంపెనీలు కూడా నిర్వహిస్తోంది. ఫెమీ9 కంపెనీకి సంబంధించి మధురైలో తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులతో ఓ కార్యక్రమం నిర్వహించింది. ఉదయం 9.00 గంటలకు నయనతార వస్తే కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉంటుంది. కానీ ఆమె ఆరు గంటలు ఆలస్యంగా భర్తతో కలిసి వచ్చింది. దీనివల్ల మధ్యాహ్నానికి ముగియాల్సిన కార్యక్రమం సాయంత్రం ఆరుగంటల వరకు కొనసాగింది. ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొన్ని ఫొటోలను నయనతార పోస్ట్ చేశారు. ఆమె అహంకారంతోనే ఇలా చేసిందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. తన దగ్గర ఉద్యోగం చేస్తున్నంతమాత్రాన వారిని ఇబ్బందిపెట్టే హక్కు వారికి ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. గతం నుంచి ఉన్న విమర్శలను నిజం చేసిందని, వారికి క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు.
-
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
"నేను ఎంతమందితో తిరిగినా అది నీ ప్రాబ్లెమ్ కాదు" -
మరో కొత్త కాన్సెప్ట్..? గ్యాప్ ఇవ్వు అన్న కాస్తా..! -
గద్దర్ అవార్డుల్లో గీతా ఆర్ట్స్ హవా.. ఆయన మంత్రాంగం పనిచేసిందా? -
వీడియో వైరల్: స్నేహా రెడ్డికి ఖరీదైన బహుమతి ఇచ్చిన అల్లు అర్జున్.. -
లాగిపెట్టి కొట్టిన అపరిచితుడు.. నడిరోడ్డుపై ఏడుస్తూ హీరోయిన్ గోడు! వీడియో -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
ఆ హీరోని చూస్తే సింహాన్ని చూసినట్టే - కోర్టు బ్యూటీ శ్రీదేవి -
విజయ్ దేవరకొండ - రష్మికల్లో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? -
తప్పేం చేయలేదు.. తిరుమలలో కేక్ కటింగ్ వివాదంపై దివ్వెల మాధురి షాకింగ్ స్పందన! -
ఆ సినిమా వదులుకోవడమే ప్రభాస్ కెరీర్‌కు ‘శ్రీరామరక్ష’












Click it and Unblock the Notifications