భారతదేశంలోనే రిచ్చెస్ట్ హీరోయిన్ నయనతార!!
సినిమాలో హీరో హీరోయిన్లు అంటే ఫాన్స్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. వాళ్ళు వేసుకునే బట్టల నుంచి వాళ్ళ ఏజ్ వరకు అంతేకాదు వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. ఇక అలాగే తాజాగా అసలు ఇండియాలో సినీ ఇండస్ట్రీలో రిచెస్ట్ హీరోయిన్ ఎవరు? అన్నది ఇప్పుడు ప్రస్తుతం సినీ వర్గాలలోనే కాదు అభిమానులలోనూ ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.
అత్యంత సంపన్న నటిగా ఆమె
సౌత్ ఇండియాలో అత్యంత సంపన్నమైన నటిగా ప్రస్తుతం జనాలలో బాగా క్రేజ్ ఉన్న రష్మిక మందన్న, సమంత రూత్ ప్రభు ఉన్నారు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే . దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోనే కాదు, భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత సంపన్న నటిగా గుర్తింపు పొందిన నటి నయనతార.

భారీ రెమ్యునరేషన్ తీసుకునే నయనతార
ఇటీవల షారుఖ్ ఖాన్ తో కలిసి యాక్షన్ థ్రిల్లర్ సినిమా అయినా జవాన్ లో బాలీవుడ్ లో నటించిన నయనతార ఇండియాలో అత్యంత సంపన్నవంతమైన హీరోయిన్ గా గుర్తించబడ్డారు. నయనతార తాను నటించే చిత్రాలకు కోట్లలోనే పారితోషికం తీసుకుంటారు . అట్లీ దర్శకత్వం వహించిన చిత్రంలో ఫోర్స్ వన్ నాయకురాలు నర్మదా రాయ్ పాత్రను పోషించడానికి నయనతార ఏకంగా 10 కోట్ల రూపాయలను తీసుకున్నారని చెబుతున్నారు.
నయనతార నికర ఆస్తుల విలువ
ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం నయనతార నికర ఆస్తుల విలువ సుమారు 183 కోట్లుగా ఉందని చెబుతున్నారు. హైదరాబాద్, చెన్నై, కేరళ వంటి బహుళ నగరాలలో నయనతారకు సొంతిల్లు ఉందని, ఆమెకు ఒక ప్రైవేటు జెట్, ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఆమె స్థిర, చర ఆస్తుల మొత్తం విలువ దాదాపు 300కోట్లు అని చెప్తున్నారు.
ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్
నయనతార నటనతో పాటు, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, సినిమాల నిర్మాణం, సోషల్ మీడియాలో ప్రచార పోస్టులు, నైస్ స్కిన్ అనే నయనతార చర్మ సంరక్షణ బ్రాండ్ మాత్రమే కాదు అనేక ఇతర పెట్టుబడుల ద్వారా ఆమె డబ్బును సంపాదిస్తుందని చెప్తున్నారు. లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్న నయనతార సౌత్ ఇండియాలోనే కాదు ఇండియాలోని అత్యధిక సంపన్నురాలైన హీరోయిన్ అని చెప్తున్నారు.
స్టార్ హీరోయిన్ గా నయనతార
2003లో మనస్సినక్కరే అనే మలయాళ సినిమాతో తెరంగేట్రం చేసిన నయనతార అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు నయనతార. ఒక్క సినిమాకి నయనతార ఐదు కోట్ల నుంచి పది కోట్ల రూపాయలు వసూలు చేస్తారని చెబుతున్నారు.ఆమె ఎలాంటి రోల్ అయినా, ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలైనా నటనలో అదరగొడతారని టాక్.












Click it and Unblock the Notifications