ఆ చెత్త సినిమాలో నటించి తప్పు చేశా.. నయనతార షాకింగ్ కామెంట్స్

సౌత్‌లో స్టార్ హీరోయిన్ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది నయనతారనే. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ నయనతార స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా తమిళనాట నయనతార క్రేజ్ వేరు. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీని సంపాదించుకుందామె. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే పెళ్లి తరువాత నయనతార హవా కాస్తా తగ్గిందనే చెప్పాలి. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

విఘ్నేష్ శివన్‌ కన్నా ముందు శింబు, ప్రభుదేవాలతో ప్రేమయాణం సాగించింది ఈ హ్యాట్ బ్యూటీ. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ నుంచి కూడా నయనతారకు వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో నయనతార సోషల్ మీడియాలో ఉండేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఆమె గజిని సినిమా గురించి చేసిన కామెంట్స్ తీవ్ర దూమారం రేపుతున్నాయి. నా కెరీర్‌లో గజిని సినిమాను ఓకే చేయడం అత్యంత చెత్త నిర్ణయంగా నయనతార చెప్పుకొచ్చారు. ఈ సినిమా కథ నాకు చెప్పిన విధంగా తెరకెక్కించలేదని ఆమె మండిపడ్డారు.

Nayanthara said choosing Ghajini was her worst choice

గజిని మూవీలో తన పాత్రను ముందు చెప్పిన విధంగా తెరకెక్కించలేదని నయన్ తెలిపింది. దాంతో ఈ సినిమాలో నటించడం నేను తీసుకున్న అతి పెద్ద చెత్త నిర్ణయం అంటూ నయన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. 2005లో స్టార్ హీరో సూర్య, స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'గజిని'. సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఇందులో ఆసీస్ హీరోయిన్ గా నటించగా.. నయనతార ఓ కీ రోల్ లో మెరిసింది. ఈ సినిమాతోనే నయనతారకు మంచి గుర్తింపు లభించింది. అయినప్పటికి నయనతార గజిని సినిమా గురించి ఇలా కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+