హరీష్ శంకర్ కనిపిస్తే రవితేజ ఫ్యాన్స్ చంపేస్తారేమో..!
ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపించిన వారిలో దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఒకరు. సెలబ్రిటీలు మీడియా అంటే కాస్తా భయపడుతుంటారు. కానీ హరీష్ శంకర్ మాత్రం తనదైనశైలిలో మీడియాపైనే పంచ్‌లు వేస్తుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హరీష్ శంకర్, తన సినిమా ఆప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులకు షేర్ చేస్తుంటారు. వారు అడిగిన ప్రశ్నలకు తనదైనశైలిలో సమాధానం కూడా ఇస్తుంటారు.
ఇదే సమయంలో తనని ట్రోల్ చేసిని వారికి సైతం అదే రీతిలో కౌంటరిస్తుంటారు. ఓ సందర్భంలో మీడియా ప్రతినిధి సురేష్ కొండేటిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారాయన. మన తెలుగు దర్శకులు ఎందుకు మంచి సినిమాలు చేయడం లేదని సురేష్ కొండేటి ప్రశ్నించాడు. హరీష్ శంకర్ ఒక్కసారిగా సురేష్ కొండేటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సురేష్ కొండేటి ఈ మధ్య యూట్యూబ్‌లో ఫేమస్ అవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు.

ఎవరు అడగని ప్రశ్న సురేష్ కొండేటి అడిగి ఫేమస్ అవ్వాలని చూస్తున్నారని దర్శకుడు హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. ఒక సామేత ఉందంటా .. వినేవాడు సురేష్ అయితే..చెప్పేవాడు హరీష్ అంటా అంటూ సురేష్ కొండేటికి కౌంటరిచ్చారు. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో మీడియాపై తన వెటకారపు మాటలతో హరీష్ రెచ్చిపోతుంటారు. ఇదిలా ఉంటే హరీష్ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా ''మిస్టర్ బచ్చన్''. మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకులు ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా అంచనాలు అందుకోవడం ఫెయిల్ అయిందని తెలుస్తోంది.
సినిమా చూసిన వారు నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. దీంతో మూవీపై తీవ్రమైన ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. రవితేజ లైఫ్ ఇస్తే , ఆయన లైఫ్‌తోనే హరీష్ శంకర్ ఆడుకున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. రీమేక్ సినిమాను ఇలా కూడా తీస్తారా అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. హీరోయిన్‌ను కేవలం గ్లామర్‌కే పరిమితం చేశారని, కథను బాగా సాగదీశాడని హరీష్ శంకర్‌ను ట్రోల్ చేస్తున్నారు. మీడియా అటెన్షన్‌పై ఉన్న శ్రద్ద సినిమాపై పెడితే బాగుండేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ''మిస్టర్ బచ్చన్'' నెగిటివ్ టాక్ రావడంతో రవితేజ అభిమానులు హరీష్ శంకర్‌పై గుర్రుగా ఉన్నారు.












Click it and Unblock the Notifications