'ఐ బొమ్మ'లో కొత్త సినిమాలు వచ్చేశాయ్..!!
ఐ బొమ్మ అనేది తెలుగు సినిమాలను ఆన్‌లైన్‌లో చూడడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక ప్రముఖ వెబ్‌సైట్ అనే విషయం అందరికి తెలిసిందే. ఇది తాజా తెలుగు సినిమాల నుండి క్లాసిక్ హిట్స్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంది. అయితే, ఇది చట్టవిరుద్ధమైన వెబ్‌సైట్ అని గమనించాలి. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘిస్తూ, అధికారిక అనుమతి లేకుండా సినిమాలను ప్రసారం చేస్తుంది. ఐ బొమ్మ ద్వారా తాజా బ్లాక్‌బస్టర్‌లు, క్లాసిక్ హిట్స్, చిన్న సినిమాలు వంటి అన్ని రకాల తెలుగు సినిమాలను ఒకే చోట చూడవచ్చు.
దీని ద్వారా ఎటువంటి చెల్లింపులు లేకుండా సినిమాలను ఉచితంగా చూడవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది: సినిమాలను డౌన్‌లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్‌లో కూడా చూడవచ్చు. తాజాగా ఐ బొమ్మలో కొత్త సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. నిఖిల్ హీరోగా నటించిన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమా బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చింది.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో విడుదలైన రెండు వారాలకే ఈ సినిమా ఓటీటీలో ప్రత్యక్షమైంది. ఇక మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన 'లక్కీ భాస్కర్' సినిమా గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
{image- telugu.oneindia.com}
వెంకీ అట్లూరీ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగుతో పాటు, మలయాళంలో కూడా విడుదలైంది. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి నిర్మాతలకు లాభాలను తెచ్చి పెట్టింది. ఇక కిరణ్ అబ్బవరం నటించిన ప్రెస్టీజియస్ మూవీ 'క'మూవీ సైతం గురువారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రూ.50 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి క్లీన్ హిట్‌గా నిలిచింది. తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన 'అమరన్' సినిమా కూడా సైతం గురువారం రాత్రి నుంచి అందుబాటులోకి రానుంది. వీటితో పాటు, లగ్గం,బఘీర, కిష్కింద కాండ వంటి సినిమాలు ఐ బొమ్మలో అందుబాటులోకి వచ్చాయి.












Click it and Unblock the Notifications