ఓటీటీలోకి టిల్లు స్క్వేర్.. మొత్తం 17 సినిమాలు
ఓటీటీ లోకి ఏకంగా 17 సినిమాలు విడుదలవుతున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ సంచలన చిత్రం టిల్లు స్క్వేర్, గోపీచంద్ భీమ సినిమాలు కూడా వీటిల్లో ఉన్నాయి. మార్చి 29న థియేటర్ లోకి వచ్చిన టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రూ.125 కోట్ల వసూళ్లు సాధించింది. మాలిక్ రామ్ దర్శకుడు కాగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. నాలుగు వారాల గడువు ముగియడంతో ఓటీటీలోకి ఇది రాబోతోంది. హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈనెల 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవబోతోంది.
గోపీచంద్ భీమ ఈనెల 25వ తేదీ నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవబోతోంది. ఏ హర్ దర్శకుడు కాగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది. వీటితోపాటు హాలీవుడ్ సినిమాలు, సిరీస్ లు అందుబాటులోకి వచ్చాయి.

హాట్ స్టార్
ఏప్రిల్ 25 - భీమ
ఏప్రిల్ 26 - థ్యాంక్ యూ గుడ్ నైట్ (ఇంగ్లిష్ సిరీస్)
ఏప్రిల్ 26 - క్రాక్ (హిందీ సినిమా)
అమెజాన్ ప్రైమ్
ఏప్రిల్ 25 - దిల్ దోస్తీ డైలమా (హిందీ సిరీస్)
నెట్ ఫ్లిక్స్
ఏప్రిల్ 23 - బ్రిగంటి(ఇటాలియన్ సిరీస్)
ఏప్రిల్ 23 -ఫైట్ ఫర్ ప్యారడైజ్ (జర్మన్ సిరీస్)
ఏప్రిల్ 24 - డెలివరీ మీ (స్వీడిష్ సిరీస్)
ఏప్రిల్ 25 - సిటీ హంటర్ (జపనీస్ సినిమా)
ఏప్రిల్ 25 - డెడ్ బాయ్ డిటెక్టివ్స్ (ఇంగ్లిష్ సిరీస్)
ఏప్రిల్ 26 - టిల్లు స్క్వేర్ (తెలుగు సినిమా)
ఏప్రిల్ 26 - గుడ్ బాయ్ ఎర్త్ (కొరియన్ సిరీస్)
ఏప్రిల్ 26 - ద అసుంత కేస్ (స్పానిష్ సిరీస్)
జియో సినిమా
ఏప్రిల్ 23 - ది జింక్స్ పార్ట్ 2(ఇంగ్లీష్ సిరీస్)
ఏప్రిల్ 27 -వియార్ హియర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)
ఆపిల్ ప్లస్ టీవీ
ఏప్రిల్ 24 -ది బిగ్ డోర్ ప్రైజ్ సీజన్ 2(ఇంగ్లీష్ సిరీస్)
బుక్ మై షో
ఏప్రిల్ 26 - కుంగ్ ఫు పాండా 4(ఇంగ్లీష్ సినిమా)
లయన్స్ గేట్ ప్లే
ఏప్రిల్ 26 - ది బీ కీపర్(ఇంగ్లీష్ సినిమా)












Click it and Unblock the Notifications