సైలెంట్‌గా ఆ యంగ్ హీరోతో మెగా డాటర్ ప్రేమాయణం ..?
మెగా డాటర్ నిహారిక ఇటీవల ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. విడాకులు తీసుకున్న తరువాత మళ్లీ ఇండస్ట్రీలో యాక్టివ్ అవడానికి ప్రయత్నిస్తోంది. నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. చైతన్య అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. అయితే భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించ లేకపోయింది. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో పెళ్లైన సంవత్సరానికి భర్తకు విడాకులిచ్చి షాకిచ్చింది.
అయితే ఆ సమయంలో నిహారికను నెటిజన్లు ఘోరంగానే ట్రోల్ చేశారు. విడాకుల తీసుకోవడంలో నిహారికదే తప్పని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. విడాకుల అనంతరం కొంతకాలం సైలెంట్ అయిన నిహారిక ..ఇటీవల సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్‌గా కనిపిస్తుంది.ఇండస్ట్రీలో తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఈసారి నటిగా కాకుండా నిర్మాతగా మారి ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.

ఆమె తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన 'కమిటీ కుర్రాళ్లు' సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.తాను నిర్మించిన తొలి సినిమా హిట్ కావడంతో నిహారిక సైతం ఆనందం వ్యక్తం చేశారు. తొలి సినిమాతోనే సక్సెస్ కొట్టిన నిహారిక ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే నిహారికకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. టాలీవుడ్ యంగ్ హీరోతో మెగా డాటర్ ప్రేమాయణం సాగిస్తుందనే ప్రచారం ఇండస్ట్రీలో సాగుతోంది.
యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డతో ప్రేమాయణం నడుపుతుందని, వీళ్లిద్దరు కలిసి రీసెంట్‌గా ఒక రెస్టారంట్‌కి వెళ్లి డిన్నర్ చేశారని చెప్పి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇది ఫేక్ వీడియో అని మెగా అభిమానులు తేల్చేశారు.యూట్యూబ్‌లో ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి పెట్టడంపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వాళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్న విషయం పూర్తిగా అవాస్తవమని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో నిరూపించారు.












Click it and Unblock the Notifications