అతనితో నా రిలేషన్ ఐదేళ్లు.. ఓపెనైనా మెగా డాటర్
మెగా డాటర్ నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. తొలుత టీవీ షోల్లో హోస్ట్‌గా కనిపించిన నిహారిక తరువాత వెండితెర మీద హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు రాలేదు. ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో పెళ్లి పీటలెక్కింది. చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. అయితే మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించ లేకపోయింది.
అతనితో విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. అయితే ఆ సమయంలో నిహారికను నెటిజన్లు ఘోరంగానే ట్రోల్ చేశారు. విడాకుల తీసుకోవడంలో నిహారికదే తప్పని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తనపై వస్తోన్న ప్రచారం గురించి నిహారిక పెద్దగా ఎప్పుడు స్పందించలేదు. ఓ యూట్యూబ్‌లో ఛానెల్‌లో మాట్లాడిన నిహారిక తన విడాకులపై క్లారిటీ ఇచ్చారు. పెళ్లైనా ఏడాదికే విడాకులు తీసుకుంటానని ఊహించలేదు.దెబ్బ తగిలిన వారికి ఆ నొప్పి ఏంటో తెలుస్తోంది.

పెళ్లి, విడాకులు అనేది ఈజీ కాదని.. నా భవిష్యత్తు గురించి ఆలోచించే విడాకులు తీసుకున్నానని నిహారిక చెప్పుకొచ్చింది. విడాకులు అనంతరం నిహారిక తిరిగి సినిమాల్లో నటిస్తోంది. మంచు మనోజ్ పక్కన హీరోయిన్‌గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళంలో 'మద్రాస్‌కారన్' మూవీలో హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది.
తెలుగులో మనోజ్ నటిస్తోన్న ''వాట్ ది ఫిష్'' అనే సినిమాలో నిహారిక హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఆమె తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన ''కమిటీ కుర్రాళ్లు'' సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే నిహారిక తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌లో పెట్టిన స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ యంగ్ హీరో అంకిత్ కొయ్య గురించి నిహారిక ఆసక్తికర కామెంట్స్ చేసింది.

అంకిత్ పుట్టిన రోజు సందర్భంగా నిహారిక రియాక్ట్ అవుతూ..నాకు ఐదేళ్లుగా తెలుసు.. కలిసినప్పుడు గంటల కొద్దీ ఎప్పుడూ మాట్లాడుకునే సినిమా టాపిక్ నాకు చాలా ఇష్టం.. అది నేను చాలా ఎంజాయ్ చేస్తుంటాను.. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సపోర్టివ్ పిల్లర్‌గా నిలిచారు.. ప్యాషనేట్ స్టోరీ టెల్లర్స్‌కు సపోర్ట్‌గా నిలుస్తూ సరైన ఫ్లాట్ ఫాంలు కల్పిస్తుంటారు.. ఇలానే స్వచ్చమైన మనసుతో ముందుకు వెళ్తుండాలి.. హ్యాపీ బర్త్ డే అంకిత్.. అంటూ నిహారిక తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. హీరో అంకిత్ గురించి నిహారిక షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications