మోక్షజ్ఞ ఎంట్రీపై ఎన్టీఆర్ కామెంట్స్..ఆ ట్వీట్‌తో షాక్
నందమూరి ఫ్యామిలీ మూడోతరం నుంచి మరో హీరో ఎంట్రీ ఇచ్చాడు. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీ ఫిక్స్ అయింది. మోక్షజ్ఞ పుట్టిన రోజు కావడంతో ఆయన నటిస్తున్న మొదటి సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్‌ను అధికారికంగా విడుదల చేశారు. ట్విట్టర్ వేదికగా ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ మూవీ తెరకెక్కించడం సంతోషంగా ఉందని తెలియజేస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
Congratulations on your debut into the world of cinema!
— Jr NTR (@tarak9999) September 6, 2024
May all the divine forces along with Thatha garu, shower blessings upon you as you begin a new chapter in your life!
Happy birthday Mokshu @MokshNandamuri pic.twitter.com/5LOBVLn862
అయితే ఈ సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రెండో ప్రాజెక్ట్‌గా రాబోతుంది. అయితే దీనిని ఎస్‌ఎల్‌వీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి, బాలయ్య చిన్న కుమార్తె మతుకుమిల్లి తేజస్విని కలిసి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మోక్షజ్ఞ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. ఆ ట్విట్టర్ వేదికగా మోక్షజ్ఞకు అభినందనలు తెలిపారు.

''పుట్టిన రోజు శుభాకాంక్షలు మోక్షు. నువ్వు సినిమా ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలు! మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు తాత గారి ఆశీర్వాదాలతో పాటు అన్ని దైవిక శక్తులు మీపై ఉంటుంది'' అని ఎన్టీఆర్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. మరో నందమూరి హీరో కల్యాణ్ రామ్ సైతం మోక్షజ్ఞ ఎంట్రీపై స్పందించారు.''టిన్సెల్ టౌన్‌కు మోక్షుకు స్వాగతం.తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని కల్యాణ్ రామ్ ట్విట్ చేశారు.
Welcome to the Tinsel Town Mokshu !!
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) September 6, 2024
తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను…
Wish you a very very Happy Birthday!! pic.twitter.com/77PfROmkoJ
గత కొంతకాలంగా బాలయ్య కుటుంబంతో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ దూరంగా ఉంటున్నారు. ఇటీవల బాలకృష్ణ 50 వసంతాలు వేడుకకు సైతం ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లకు ఆహ్వానం అందలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మోక్షజ్ఞ ఎంట్రీపై ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు స్పందించడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక అది చూసిన నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది












Click it and Unblock the Notifications