NTR DEVARA :'దేవర' ట్రైలర్ రివ్యూ: ఎన్టీఆర్ విశ్వరూపమే..!
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్నతరుణం రానే వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న చిత్రం 'దేవర'. తాజాగా ఈ సినిమాకు సంబంధించినట్రైలర్ విడుదలైంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ గెటప్ అదిరిపోయిందనే చెప్పాలి. ట్రైలర్‌ను చూస్తుంటే సముద్రం చూట్టు జరిగే కథగా అర్థం అవుతోంది. తండ్రి , కోడుకులుగా ఎన్టీఆర్ కనిపించనున్నారు. తండ్రి ఎన్టీఆర్ చనిపోతే, ఆయన స్థానంలో కొడుకు ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వనున్నారని ట్రైలర్‌ను చూస్తే తెలిసిపోతుంది. విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించారు. కథలో ఆయన నిడివి ఎక్కువగానే ఉండేలా కనిపిస్తోంది. ఇక ట్రైలర్‌లో జాన్వీ కపూర్ గెటప్ సైతం ఆకట్టుకునే ఉంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న దేవర, మొదటి పార్ట్‌ను సెప్టెంబర్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాతో అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచియమవుతున్నారు. 'ఆచార్య' వంటి ఫ్లాప్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా ''ఎందుకు పుట్టిందో'' సాంగ్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే ది బెస్ట్ సాంగ్‌గా నిలిచింది.

ఇక ఈ ఏడాదే ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వార్-2 సినిమాలో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. వార్-2తో పాటు మరో బాలీవుడ్ సినిమాకు కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తీయబోయే కొత్త సినిమాలో ఎన్టీఆర్ ఎంపికైయ్యారని గుస గుసలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications