OG Universe: ' ఓజీ 2 'నుంచి బిగ్ అప్డేట్.. పవన్ ఫ్యాన్స్ కు బర్త్ డే ట్రీట్..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. కానీ 2025 లో వచ్చిన 'ఓజీ' సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాదు. బాక్సాఫీస్ ముందు పవన్ స్టామినా ఏంటో మరోసారి రుచి చూపించింది. యంగ్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన ఈ సినిమా గతేడాది సెప్టెంబర్ లో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ మూవీలో పనన్ కల్యాణ్ మునుపెన్నడూ చూడని లుక్ లో ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశారు. ఆయన స్వాగ్ లుక్స్, యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీలో పవన్ సరసన ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా కనిపించింది. అలాగే ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్ రాజ్, శ్రేయా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
అయితే ఈ సినిమాకు పార్ట్ 2 ఉంటుందని ఆ సమయంలోనే మేకర్స్ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓజీ సినిమా ఎండింగ్ లో మనకు ఆ విషయం తెలుస్తుంది. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు 'ఓజీ' దర్శకుడు సుజిత్ అద్దిరిపోయే శుభవార్త వినిపించారు. ఓజీ యూనివర్స్ నుంచి క్రేజీ వీడియోను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు.
From the #OGUniverse
— Sujeeth (@Sujeethsign) September 2, 2026
To the #OG…
ALL LOVE for everything so far…
And everything that begins from here :) 🧿🧿♥️♥️
Happy Birthday @PawanKalyan Sir 🔥 pic.twitter.com/nVCzic6nBk
ఈ స్పెషల్ వీడియోలో పవన్ కల్యాణ్, దర్శకుడు సుజిత్ అలాగే చిత్ర సంగీత దర్శకుడు తమన్ కలిసి 'ఓజీ యూనివర్స్' కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఓజీ మూవీలోని స్టోరీ కేవలం ప్రెజెంట్ కాలానికి సంబంధించింది కాదని.. సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్యోద్యమం సమయంలో ఏర్పాటు చేసిన ఆజాద్ హింద్ ఫౌజ్ కాలం నుంచి నేటి వరకూ జరిగిన కీలక సంఘటనలను ఆధారంగా చేసుకుని ఓజీ యూనివర్స్ ను రూపొందించినట్లు ఈ వీడియోలో తెలిపారు. ఈ క్రమంలో ఓజీ యూనివర్స్ కథ, కథనం పరిధి చాలా పెద్దదిగా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

ఇక అంతకుముందు దర్శకుడు సుజిత్ పవన్ కల్యాణ్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఓజీ షూట్ సందర్భంగా ఆయనతో దిగిన ఫొటోలను పంచుకున్నారు. చిన్నప్పటినుంచి నేను ఆరాధిస్తున్న వ్యక్తి అని సుజిత్ ఎమోషనల్ అయ్యారు. మీరే నా మొదటి హీరో అని ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ఇక ఓజీ 2 పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.












Click it and Unblock the Notifications