బాలకృష్ణకు పద్మభూషణ్‌పై స్పందించని ఏకైక హీరో అతనే

టీడీపీ ఎమ్మెల్యే,సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ నుంచి డాక్టర్ దువ్వూరు నాగేశ్వర రెడ్డికి , ఏపీ నుంచి సీనియర్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. సినీ రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తించి పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కడంపై పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.

చిరంజీవి,పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని, కల్యాణ్ రామ్, వెంకటేష్, విశ్వక్ సేన్, జోన్నలగడ్డ సిద్ధు వంటి హీరోలు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంపై స్పందించారు. అయితే బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంపై సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ పెద్ద కుటుంబం నుంచి ఎటువంటి రెస్పన్స్ రాలేదు. ఆ కుటుంబం మరేదో కాదు.. అక్కినేని ఫ్యామిలీ. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డుపై అక్కినేని కుటుంబం నుంచి ఎవరూ స్పందించలేదు. గత కొంతకాలంగా అక్కినేని, నందమూరి ఫ్యామిలీల మధ్య గ్యాప్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, కొద్ది రోజులుగా ఈ రెండు ఫ్యామిలీల మధ్య సత్సంబంధాలు లేవు. ఆ మధ్య బాలకృష్ణ ఓ సినిమా ఈవెంట్‌లో మాట్లాడుతూ.. అక్కినేని తొక్కినేని అంటూ మాట్లాడారు. ఆ సమయంలో అక్కినేని హీరోలు సైతం రియాక్ట్ అయ్యారు. నాగ చైతన్య దీనిపై స్పందిస్తూ..ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌లు రెండు కళ్లు లాంటి వారని, అలాంటి వారిని తక్కువ చేసి మాట్లాడితే.. మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టే అంటూ బాలకృష్ణ మాట్లాడిన మాటలకు నాగ చైతన్య కౌంటరిచ్చారు.

only hero who responded to Balakrishna Padma Bhusha

ఇక బాలకృష్ణ, నాగార్జునల మధ్య కూడా ఎన్నో ఏళ్ల నుంచి మాటలు లేవని తెలుస్తోంది. ఆ మధ్య ఓ ఈవెంట్‌లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కలిసి సందడి చేశారు.బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో కూడా చిరంజీవి, వెంకటేష్‌లు కనిపించారు. అయితే ఈ ఈవెంట్స్‌లో ఎక్కడా కూడా నాగార్జున కనిపించలేదు. మరోవైపు నాగార్జున చిరంజీవి, వెంకటేష్‌లో మంచి బంధాలనే కొనసాగిస్తున్నారు. తాజాగా బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డుపై సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరూ స్పందించారు. నాగార్జున నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ రాలేదు.ఈ ఘటనతో మరోసారి బాలకృష్ణ, నాగార్జునల మధ్య విభేదాలు మరోసారి తెర మీదకు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+