చిరంజీవితో భార్యగా, చెల్లెలుగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఇండస్ట్రీకి చెందిన హీరోల కొడుకులు వారసులుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వారిని దాటుకుని మరీ నెంబర్ వన్ స్థానాన్ని చిరంజీవి కైవసం చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్లపాటు తెలుగులో టాప్ హీరోగా చిరంజీవి నిలిచారంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒకనొక సమయంలో దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా చిరంజీవి నిలిచారు.
సినిమాల్లో వచ్చిన క్రేజ్‌తో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాల్లో ఫెయిల్ అయిన చిరంజీవి, తిరిగి సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చారు. 10 ఏళ్ల తర్వాత తిరిగి సినిమాల్లో నటించినప్పటికీ తన స్టామినా ఏమాత్రం చెక్కుచెదరలేదని నిరూపించారు. ఆరు పదుల వయస్సులో కూడా ఆయన వరుస సినిమాల్లో నటిస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి చాలామంది హీరోయిన్లతో నటించారు. వారిలో కొంతమంది స్టార్ హీరోయిన్లుగా కూడా ఎదిగారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం చిరంజీవి పక్కన భార్యగా నటించింది.

విచిత్రం ఏమిటంటే అదే హీరోయిన్ చిరంజీవితో చెల్లెలుగా కూడా నటించి షాకిచ్చింది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు నయనతార. చిరంజీవి పక్కన నయనతార భార్యగా, చెల్లిగా నటించింది. చిరంజీవి ,నయనతార కలిసి తొలుత సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించారు. ఈ సినిమాలో చిరంజీవి భార్యగా కనిపించారు నయనతార. ఆ తర్వాత వీరిద్దరు కలిసి గాడ్ ఫాదర్‌లో నటించారు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లులుగా కనిపించారు నయనతార. విచిత్రం ఏమిటంటే ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచాయి.












Click it and Unblock the Notifications