పవిత్రా లోకేష్(నరేష్) రెమ్యునరేషన్
రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా తర్వాత అత్యంత పాపులరైన విషయం ఏదంటే.. నరేష్-పవిత్రా లోకేష్ డేటింగ్. వారిద్దరూ పెళ్లిచేసుకోబోతున్నారని, ఆ పెళ్లికి నరేష్ రెండో భార్య అడ్డంకులు సృష్టిస్తున్నట్లు కథనాలు వచ్చాయి. స్టార్ హీరో, హీరోయిన్ల రేంజ్ కు మించిన ప్రచారం వీరికి వచ్చింది. ఇటీవలే నరేష్ పక్కన మళ్లీ పెళ్లి అనే సినిమాలో పవిత్రా లోకేష్ నటించింది. అందుకు కోటిరూపాయల రెమ్యునరేషన్ తీసుకుంది.
పవిత్ర లోకేష్ మొదట కన్నడంలో నటించారు. అక్కడ నటిగా పేరు తెచ్చుకున్న తర్వాత తెలుగులో కూడా అవకాశాలు దక్కించుకున్నారు. కొన్ని సినిమాల ద్వారా నరేష్ పరిచయం కావడంతో వారి స్నేహం ప్రేమకు దారితీసింది. వివాహం చేసుకోవడానికి కుటుంబ పరంగా నరేష్ కు అడ్డంకులు ఉండటంతో ప్రస్తుతానికి డేటింగ్ లో ఉన్నారు. సినిమాల్లో నటించినందుకు పవిత్రా లోకేష్ ఎంత పారితోషికం తీసుకుంటుంది? అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక్క రోజు కాల్షీటుకు రూ.50వేలు ఛార్జి చేస్తుంది. నరేష్ తో అనుబంధం బలపడిన తర్వాత ఆ సంఖ్యను డబుల్ చేసింది. ఒకరోజుకు రూ.లక్ష తీసుకుంటుంది.

కుర్ర హీరోయిన్లకు దీటుగా ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాళ్లకు మించిన రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోంది. నిర్మాతలు కూడా అమె అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. స్టార్ హీరోయిన్లకు మించిన రేంజ్ లో అందం ఉందని, ఆమెకు ఎంత ఇచ్చినా తక్కువే అంటూ నెటిజన్ల కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మళ్లీ పెళ్లి చిత్రం డిజాస్టర్ అయినప్పటికీ ఆమెకు అవకాశాలు మాత్రం తగ్గడం లేదని చెప్పవచ్చు. తల్లిగా, సోదరిగా పలు ఆఫర్లు ఆమెను పలకరిస్తూనే ఉన్నాయి. ఏదన్నా కానీ నరేష్-పవిత్రా లోకేష్ జంటకు వచ్చినంత పబ్లిసిటీ సినీరంగంలో మరెవరికీ రాలేదని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications