త్రివిక్రమ్ శ్రీనివాస్ కు పవన్ కల్యాణ్ బర్త్ డే గిఫ్ట్

తెలుగు సినీ పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్నేహానికి పర్యాయ పదంగా నిలిచారు. జల్సా చిత్రం నుంచి ప్రారంభమైన వీరి స్నేహం రోజురోజుకు చిగురిస్తోంది. త్రివిక్రమ్ ప్రమేయం లేకుండా పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమా చేయడంలేదు. కథలోకానీ, రచనలోకానీ, దర్శకత్వంలోకానీ.. దేంట్లోనైనా త్రివిక్రమ్ జోక్యం చేసుకోవాల్సిందే. పవన్ కల్యాణ్ తో సినిమా చేసే రచయిత, దర్శకులకు ఆయన సహకారం అందిస్తారు.

వీరిద్దరి కాంబినేషన్ లో జల్సా తర్వాత అత్తారింటికి దారేది వచ్చింది. ఆ తర్వాత అజ్ఞాతవాసి విడుదలైందికానీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. పవన్ ఇటీవలి చిత్రాలు భమ్లానాయక్, బ్రో సినిమాలకు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు. అందుకు తగ్గ రెమ్యునరేషన్ ను అందుకుంటారు. అయితే ఈరోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ జన్మదినం కావడంతో ప్రత్యేకంగా ఏదైనా బహుమతి ఇవ్వాలని భావించిన పవన్ కల్యాణ్ తమ స్నేహానికి గుర్తుగా బంజారాహిల్స్ లో రూ.6కోట్ల విలువైన ఇంటిని ఇచ్చారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

pawan kalyan birthday gifi to trivikram srinivas

ప్రస్తుతం పవన్ మూడు సినిమాలు చేస్తున్నారు. ఆ మూడు సినిమాలను కూడా సెట్ చేసింది త్రివిక్రమే. పవన్ కు కథ వినిపించే దర్శకులు త్రివిక్రమ్ కు కూడా వినిపిస్తారు. అందులో ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే ఆయన సూచిస్తారు. తనపట్ల ఇంత ప్రేమను, శ్రద్దను కనపరిచే త్రివిక్రమ్ కు అలా ఇంటిని ఇవ్వడం కూడా తక్కువేనని, కానీ వారి స్నేహం మాత్రం చిరకాలం నిలవాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం చేస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఇది రూపుదిద్దుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+